లాక్‌డౌన్ వేళ.. గుడుంబా దందా!
దిశ, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో గుడుంబా తయారీ ఊపందుకున్నది. పల్లెల్లో గుడుంబా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. లాక్‌డౌన్‌తో మద్యం షాపులు మూసివేయడంతో మద్యం ప్రియుల బలహీనతను ఆసరా చేసుకుని గుడుంబాను తయారు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, నర్సాపూర్, మెదక్, తూఫ్రాన్, హుస్నాబాద్, దుబ్బాక, నంగునూర్ మండలాల్లో తండాలో గుడుంబా తయారు చేస్తున్నారు. తండాలే కాకుండా కొన్ని శివారు పల్లెల్లో కూడా గుడుంబా తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. షేరు సారాకు.. ఇటీవల సమ్మక్క […]
దిశ, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో గుడుంబా తయారీ ఊపందుకున్నది. పల్లెల్లో గుడుంబా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. లాక్‌డౌన్‌తో మద్యం షాపులు మూసివేయడంతో మద్యం ప్రియుల బలహీనతను ఆసరా చేసుకుని గుడుంబాను తయారు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, నర్సాపూర్, మెదక్, తూఫ్రాన్, హుస్నాబాద్, దుబ్బాక, నంగునూర్ మండలాల్లో తండాలో గుడుంబా తయారు చేస్తున్నారు. తండాలే కాకుండా కొన్ని శివారు పల్లెల్లో కూడా గుడుంబా తయారు చేస్తూ విక్రయిస్తున్నారు.
షేరు సారాకు..
ఇటీవల సమ్మక్క జాతర సందర్భంగా అమ్మవారికి ఎత్తు బంగారం బెల్లం ఇచ్చిన దానిని కిలోకి 40 చొప్పున తయారీదారులు కొనుగోలు చేస్తున్నారు. బెల్లం యూరియా పటికతో గుడుంబాను తయారు చేస్తుండగా, షేరు సారాకు రూ.250లకు విక్రయిస్తున్నట్లు సమాచారం. బీర్లు, విస్కీ బంద్‌తోపాటు కల్లు కూడా అధికరేటుకు విక్రయిస్తుండడంతో మద్యంప్రియులు గుడుంబాకు ఆకర్షితులవుతున్నారు.
లాభసాటి దందా..
కొన్నేళ్ల క్రితం జహీరాబాద్, మెదక్, నర్సపూర్, దుబ్బాక, హుస్నాబాద్ డివిజన్‌లో కుటీర పరిశ్రమగా మారిన గుడుంబా తయారీ గత మూడు నాలుగేళ్లుగా బందయ్యింది. ప్రస్తుతం ఇది లాభసాటి దందాగా మారడంతో, లాక్‌డౌన్‌తో మద్యం దొరకకపోవటంతో మద్యంప్రియులు గుడుంబా వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మళ్లీ గుడుంబా దందాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Tags:Medak, gudumba making, liquor, lockdown, corona