సెకండ్ వేవ్ ఎఫెక్ట్: తొలిసారిగా రూ. లక్ష కోట్ల దిగువకు జీఎస్టీ వసూళ్లు!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినడంతో జూన్ నెలలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు క్షీణించాయి. గడిచిన ఎనిమిది నెలల తర్వాత, అలాగే ప్రస్తుత ఏడాదిలో తొలిసారిగా రూ. లక్ష కోట్ల కంటే తక్కువగా రూ. 92 వేల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. అయితే, 2020లో జూన్ నెలతో పోలిస్తే ఈసారి 2 శాతం ఎక్కువగానే వసూళ్లు జరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అంతేకాకుండా, […]

Update: 2021-07-06 07:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినడంతో జూన్ నెలలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు క్షీణించాయి. గడిచిన ఎనిమిది నెలల తర్వాత, అలాగే ప్రస్తుత ఏడాదిలో తొలిసారిగా రూ. లక్ష కోట్ల కంటే తక్కువగా రూ. 92 వేల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. అయితే, 2020లో జూన్ నెలతో పోలిస్తే ఈసారి 2 శాతం ఎక్కువగానే వసూళ్లు జరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అంతేకాకుండా, జీఎస్టీ వసూళ్లు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉన్నాయని, ప్రభుత్వం వ్యయాన్ని కొనసాగించేందుకు ఇది ఉపకరిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తం వసూళ్లు రూ. 92,849 కోట్లుగా కాగా, ఇందులో సీజీఎస్టీ రూ. 16,424 కోట్లు ఉండగా, ఎస్‌జీఎస్టీ రూ. 20,397 కోట్లుగా ఉంది. ఐజీఎస్టీ రూ. 49,079 కోట్లు(వస్తువుల దిగుమతుల నుంచి రూ. 25,762 కోట్లతో సహా, సెస్ రూపంలో రూ. 6,949 కోట్లు(వస్తువుల దిగుమతుల నుంచి రూ. 809 కోట్లతో సహా) ఉన్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.2 లక్షల కోట్లు ఉండగా, అంతకుముందు ఏప్రిల్‌లో రికార్డు స్థాయి రూ. 1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు నమోదైన సంగతి తెలిసిందే. చివరిసారిగా జీఎస్టీ వసూళ్లు గతేడాది సెప్టెంబర్‌లో రూ. లక్ష కోట్లకు దిగువన రూ. 95,480 కోట్లుగా నమోదయ్యాయి. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టడంతో లక్ష కోట్లకు పైనే నమోదవుతూ వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సెకెండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ జీఎస్టీ వసూళ్లు లక్షపైనే వచ్చాయి.

Tags:    

Similar News