జీఎస్ఐ 170ఏండ్ల వేడుకలు..
దిశ, న్యూస్ బ్యూరో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 170 ఏండ్ల వేడుకలను బుధవారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ హెచ్ఓడీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ..సంస్థ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు చేరుకున్న మైలురాళ్ల గురించి వివరించారు.అత్యంత స్ఫష్టతతో కూడిన గూగుల్ మ్యాప్‌లు రూపొందించడంలోనూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఖనిజ వనరులను గుర్తించడంలో జీఎస్ఐ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తోందని పేర్కొన్నారు. భద్రాద్రి-కొత్తగూడెం ప్రాంతాల్లో ఐరన్ ఓర్ నిక్షేపాలను గుర్తించామని, పరిశోధనలు ప్రాథమిక […]
దిశ, న్యూస్ బ్యూరో
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 170 ఏండ్ల వేడుకలను బుధవారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ హెచ్ఓడీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ..సంస్థ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు చేరుకున్న మైలురాళ్ల గురించి వివరించారు.అత్యంత స్ఫష్టతతో కూడిన గూగుల్ మ్యాప్‌లు రూపొందించడంలోనూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఖనిజ వనరులను గుర్తించడంలో జీఎస్ఐ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తోందని పేర్కొన్నారు. భద్రాద్రి-కొత్తగూడెం ప్రాంతాల్లో ఐరన్ ఓర్ నిక్షేపాలను గుర్తించామని, పరిశోధనలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్టు చెప్పారు. కార్యక్రమంలో త్రిపాఠి, బీఎస్ జోధా, క్రిష్ణ దత్ తదితరులు పాల్గొన్నారు.
tags :gsi , 170yrs celebrations, hod venkateswara rao, google map