కొవిడ్ టెస్టుల తర్వాతే ప్రచారానికి అనుమతి ఇవ్వాలి !
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు సిబ్బందికి కరోనా టెస్టులు చేసిన తర్వాతే ప్రచారానికి, విధులకు అనుమతి ఇవ్వాలని రాపోలు ఆనంద భాస్కర్ హైకోర్టును ఆశ్రయించారు. 150 డివిజన్లలో 74లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారని, ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు నేరుగా ఓటర్లను కలిసే అవకాశం ఉన్నందున ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కరోనా నెటిటివ్ ఉన్నవారిని మాత్రమే ప్రచారానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో పాల్గొనే ప్రతీ కార్యకర్త […]
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు సిబ్బందికి కరోనా టెస్టులు చేసిన తర్వాతే ప్రచారానికి, విధులకు అనుమతి ఇవ్వాలని రాపోలు ఆనంద భాస్కర్ హైకోర్టును ఆశ్రయించారు. 150 డివిజన్లలో 74లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారని, ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు నేరుగా ఓటర్లను కలిసే అవకాశం ఉన్నందున ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కరోనా నెటిటివ్ ఉన్నవారిని మాత్రమే ప్రచారానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో పాల్గొనే ప్రతీ కార్యకర్త నిబంధనలకు అనుగుణంగా మాస్క్ ధరించాలని కోరారు. లేకుంటే హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు.