ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

దిశ,మణుగూరు : తెలంగాణ సాయుధ పోరాటంలో ధీరవనిత చాకలి ఐలమ్మ పోరాట పటిమ నేటి సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మణుగూరు జెడ్పిటీసీ పొశం నరసింహారావు అన్నారు. ఆదివారం మండలంలోని ముత్యాలమ్మనగర్ పంచాయతీ పరిధిలో పీవీ కాలనీ క్రాస్ రోడ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహనికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో విప్లవాగ్నిగా నిలిచి నిజం నవాబు గుండెల్లో వణుకు పుట్టించిదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రజకుల అభివృద్ధి […]

Update: 2021-09-26 06:47 GMT

దిశ,మణుగూరు : తెలంగాణ సాయుధ పోరాటంలో ధీరవనిత చాకలి ఐలమ్మ పోరాట పటిమ నేటి సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మణుగూరు జెడ్పిటీసీ పొశం నరసింహారావు అన్నారు. ఆదివారం మండలంలోని ముత్యాలమ్మనగర్ పంచాయతీ పరిధిలో పీవీ కాలనీ క్రాస్ రోడ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహనికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో విప్లవాగ్నిగా నిలిచి నిజం నవాబు గుండెల్లో వణుకు పుట్టించిదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రజకుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో ధోబి ఘాటు నిర్మాణానికి, ప్రతి మండల కేంద్రంలో రజకసంఘాల కోసం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించేందుకు ఎమ్మెల్యే రేగా కాంతారావుతో మాట్లాడి కృషి చేస్తానన్నారు.

ఈకార్యక్రమంలో ముత్యాలమ్మనగర్ సర్పంచ్ కొమరం జాంపేశ్వరి,సమితి సింగారం పంచాయతీ ఉపసర్పంచ్ పుచ్చకాయలశంకర్, పట్టణఅధ్యక్షులు ముత్యం బాబు,వట్టం రాంబాబు,రజకసంఘం మణుగూరు మండలం అధ్యక్షులు ధర్మరాజుల శంకరయ్య,జిల్లా ఉపాధ్యక్షులు చిటికెన భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News