కరోనాతో గ్రామీ విన్నింగ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ మృతి

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గ్రామీ విన్నింగ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ హల్ విల్నెర్ కోవిడ్ 19 వ్యాధితో మృతి చెందారు. 64 ఏళ్ల విల్నెర్ చనిపోయినట్లు తన ప్రతినిధి ఏప్రిల్ 7న నిర్ధారించారు. కరోనా వైరస్ బారిన పడి హల్ విల్నెర్ మరణించినట్లు ప్రకటించారు. మార్చి 28న తన ట్విట్టర్ ఎకౌంట్‌ నుంచి పోస్ట్ పెట్టిన విల్నెర్.. కరోనాతో బాధపడుతున్నట్లు తెలిపారు. నేను ఎప్పుడూ నంబర్ వన్‌గానే ఉండాలని కోరుకుంటానని.. కానీ ఇది కాదన్నారు. యూఎస్‌లో న్యూయార్క్ కరోనా […]

Update: 2020-04-08 05:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గ్రామీ విన్నింగ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ హల్ విల్నెర్ కోవిడ్ 19 వ్యాధితో మృతి చెందారు. 64 ఏళ్ల విల్నెర్ చనిపోయినట్లు తన ప్రతినిధి ఏప్రిల్ 7న నిర్ధారించారు. కరోనా వైరస్ బారిన పడి హల్ విల్నెర్ మరణించినట్లు ప్రకటించారు. మార్చి 28న తన ట్విట్టర్ ఎకౌంట్‌ నుంచి పోస్ట్ పెట్టిన విల్నెర్.. కరోనాతో బాధపడుతున్నట్లు తెలిపారు. నేను ఎప్పుడూ నంబర్ వన్‌గానే ఉండాలని కోరుకుంటానని.. కానీ ఇది కాదన్నారు. యూఎస్‌లో న్యూయార్క్ కరోనా సంక్షోభానికి కేంద్రంగా ఉందని తెలుపుతూ ఓ మ్యాప్ పోస్ట్ చేసిన విల్నెర్… ఎగువ పడమర వైపు మంచం అంటూ మ్యాప్ కింద ఓ
లైన్ యాడ్ చేశారు..

సృజనాత్మకంగా మ్యూజిక్ అందించే నిర్మాతగా పేరు తెచ్చుకున్న హల్ వెల్నర్ మృతిపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. 1980లో తన కెరియర్‌ను ప్రారంభించిన వెల్నర్ సంగీతంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నాడు.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 64వ పుట్టినరోజు జరుపుకున్న తర్వాత రోజే మరణించి… అభిమానులను అంతులేని విషాదంలో నింపాడు.\

Tags: Hal willner, Grammy Winning Music Producers, America, USA, New York

Tags:    

Similar News