సీఎం జగన్‌తో అదానీ సోదరుల భేటీపై సమాచారం లేదు: గౌతం రెడ్డి

దిశ, ఏపీ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం అదానీ సోదరులు ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారంటూ వస్తున్న వార్తలపై ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. గౌతం అదానీ సోదరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయినట్లు తనకు సమాచారం లేదన్నారు. ఆ విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్‌లో పాల్గొన్న మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆదానీ గ్రూప్స్ నుంచి ఎలాంటి […]

Update: 2021-09-13 12:05 GMT

దిశ, ఏపీ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం అదానీ సోదరులు ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారంటూ వస్తున్న వార్తలపై ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. గౌతం అదానీ సోదరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయినట్లు తనకు సమాచారం లేదన్నారు. ఆ విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్‌లో పాల్గొన్న మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆదానీ గ్రూప్స్ నుంచి ఎలాంటి పెండింగ్ ప్రపోజల్స్ లేవని చెప్పుకొచ్చారు. అదానీ గ్రూప్స్‌తో గతంలో చేసుకున్న ఒప్పందాలే తప్ప కొత్తగా ఒప్పందాలు ఏమీ లేవని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే తాడేపల్లిలోని సీఎం నివాసంలో అదానీ బ్రదర్స్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించలేదు.


Similar News