మండల కేంద్రం కోసం గ్రామస్తుల ఆందోళన

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గౌరవెల్లి గ్రామం హుస్నాబాద్ తరవాత పెద్ద గ్రామమని, గ్రామంలో 1500 రేషన్ కార్డుదారులు ఉన్నారన్నారు. గ్రామంలో ప్రభుత్వ భూమి కూడా నిరుపయోగంగా ఉందని, గ్రామ విస్తీర్ణం కూడా పెరిగిందని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా కూడా మలుచుకోవచ్చన్నారు. చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కేంద్రబిందువుగా గౌరవెల్లి అందుబాటులో […]

Update: 2020-07-21 05:47 GMT

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గౌరవెల్లి గ్రామం హుస్నాబాద్ తరవాత పెద్ద గ్రామమని, గ్రామంలో 1500 రేషన్ కార్డుదారులు ఉన్నారన్నారు.

గ్రామంలో ప్రభుత్వ భూమి కూడా నిరుపయోగంగా ఉందని, గ్రామ విస్తీర్ణం కూడా పెరిగిందని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా కూడా మలుచుకోవచ్చన్నారు. చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కేంద్రబిందువుగా గౌరవెల్లి అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. దీంతో గౌరవెల్లి గ్రామాన్ని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఊరంతా కలిసి, ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మజ్జిక మొగిలి, గ్రామ ఉప సర్పంచ్ కొమ్ముల భాస్కర్, మాజీ ఎంపీటీసీ బైరగోని శ్రీనివాస్, వార్డు సభ్యులు దాము, వీరాచారి, శ్రీనివాస్, నాయకులు నరేష్ పాల్గొన్నారు.

Tags:    

Similar News