86 శాతం పెరిగిన మొత్తం పన్ను వసూళ్లు!

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రభుత్వం మొత్తం పన్ను వసూళ్లు 86 శాతం పెరిగి రూ. 5.57 లక్షల కోట్లకు పైగా నమోదైనట్టు సోమవారం ప్రభుత్వం తెలిపింది. ఇందులో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 2.46 లక్షల కోట్లు ఉండగా, పరోక్ష పన్ను వసూళ్లు రూ. 3.11 లక్షల కోట్లుగా ఉన్నాయని పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. పరోక్ష పన్ను వసూళ్లు గతేడాది ఇదే […]

Update: 2021-07-26 09:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రభుత్వం మొత్తం పన్ను వసూళ్లు 86 శాతం పెరిగి రూ. 5.57 లక్షల కోట్లకు పైగా నమోదైనట్టు సోమవారం ప్రభుత్వం తెలిపింది. ఇందులో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 2.46 లక్షల కోట్లు ఉండగా, పరోక్ష పన్ను వసూళ్లు రూ. 3.11 లక్షల కోట్లుగా ఉన్నాయని పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. పరోక్ష పన్ను వసూళ్లు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 70.3 శాతం వృద్ధి సాధించినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే, పన్ను ఎగవేతదారులపై సంబంధిత చట్టాల ప్రకారం ఆదాయపు పన్ను శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని సహాయమంత్రి తెలిపారు.

ప్రత్యక్ష పన్ను చట్టాల ప్రకారం.. తనిఖీలు, సర్వే, విచారణ, ఆదాయాన్ని అంచనా వేయడం, పన్నులు విధించడం, వడ్డీ, జరిమానా, క్రిమినల్ కోర్టులో ఫిర్యాదుల వర్తింపు వంటి పలు చర్యలను తీసుకోనున్నట్టు పంకజ్ చౌదరీ వివరించారు. అంతేకాకుందా బ్లాక్‌మానీ, పన్ను విధింపు చట్టం-2015 కిందర 107కి పైగా ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు నమోదైనట్టు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ఏడాది మే 31 నాటికి 166 కేసులలో ఉత్తర్వులను జారీ చేశామని, వీటి ద్వారా రూ. 8,216 కోట్లు వసూలు చేయనున్నట్టు వెల్లడించారు.

Tags:    

Similar News