ఎల్ ఐసీ, ఐపీఓ కోసం న్యాయ సలహాదారును ఖరారు చేసిన ప్రభుత్వం
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ ఐపీఓ కోసం న్యాయ సలహాదారు(లీగల్ అడ్వైజర్)గా ప్రభుత్వం సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పేరును ఎంపిక చేసింది. అతిపెద్ద ఐపీఓగా భావిస్తున్న ఎల్ఐసీ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే 10 మర్చంట్ బ్యాంకులను ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఐపీఓ న్యాయ సలహదారు హోదా కోసం బిడ్లను దాఖలు చేసిన నాలుగు సంస్థల్లో సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ సంస్థను ఖరారు చేసింది. బిడ్లను దాఖలు చేసిన […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ ఐపీఓ కోసం న్యాయ సలహాదారు(లీగల్ అడ్వైజర్)గా ప్రభుత్వం సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పేరును ఎంపిక చేసింది. అతిపెద్ద ఐపీఓగా భావిస్తున్న ఎల్ఐసీ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే 10 మర్చంట్ బ్యాంకులను ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఐపీఓ న్యాయ సలహదారు హోదా కోసం బిడ్లను దాఖలు చేసిన నాలుగు సంస్థల్లో సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ సంస్థను ఖరారు చేసింది. బిడ్లను దాఖలు చేసిన న్యాయ సలహా సంస్థల జాబితాలో లింక్ లీగల్, క్రాఫోర్డ్ బెయిలె, శార్దుల్ అమర్‌చంద్ మంగళదాస్ అండ్ కోలు ఉన్నాయి.
ఈ సంస్థలు గతవారంలో పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) ముందు ప్రజెంటేషన్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ సంస్థను దీపమ్ నిర్ణయించింది. కాగా, ఎల్ఐసీ ఐపీఓ నిర్వహించేందుకు న్యాయ సలహాదారుల నియామకం కోసం బిడ్లను దాఖలు చేసేందుకు దీపమ్ ఇదివరకు రెండుసార్లు గడువును పొడిగించింది. మొదటిసారి జూలైలో బిడ్లను ఆహ్వానించగా తుది గడువైన ఆగష్టు వరకు సరైన స్పందన రాలేదు. దీంతో దీన్ని మరోసారి ఈ నెల 6, మళ్లీ ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించింది. చివరికి నాలుగు సంస్థల నుంచి బిడ్లు దాఖలు కావడంతో ఈ ప్రక్రియను ముగించింది.