ఇరిగేషన్ ప్రాజెక్టుల విద్యుత్ సబ్సిడీలకు రూ.833 కోట్లు

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల మే నెల విద్యుత్ బిల్లులకు గాను ప్రభుత్వం సోమవారం రూ.833 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలకు‌గాను ప్రభుత్వం ఇప్పటికే రూ. 10,400 కోట్లు కేటాయించింది. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పంపుల్ని పనిచేయిస్తూ కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. […]

Update: 2020-05-04 11:22 GMT

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల మే నెల విద్యుత్ బిల్లులకు గాను ప్రభుత్వం సోమవారం రూ.833 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలకు‌గాను ప్రభుత్వం ఇప్పటికే రూ. 10,400 కోట్లు కేటాయించింది. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పంపుల్ని పనిచేయిస్తూ కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సంస్థలపై భారం పడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం వెంటవెంటనే చెల్లింపులు చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఒకే విడతలో రూ. 833 కోట్లను విడుదల చేసింది.

Tags : telangana, power, subsidies, agriculture, special chief secretary, irrigation projects

Tags:    

Similar News