ఫీజుల నియంత్రణపై ఫిర్యాదుల కేంద్రం
దిశ, హైదరాబాద్ : కొవిడ్ -19 నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి (2020-21) ప్రయివేటు విద్యా సంస్థల్లో ఎలాంటి ఫీజులు పెంచడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం జీవో 46 విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించారు. ఈ ఏడాది (2019-20) ఫీజులను కేవలం నెలవారీగా మాత్రమే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వసూలు చేయాలని సూచించింది. ఈ ఆదేశాలను ప్రయివేటు విద్యా సంస్థలు పాటించకుంటే తగు చర్యలు తీసుకుంటామని […]
దిశ, హైదరాబాద్ :
కొవిడ్ -19 నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి (2020-21) ప్రయివేటు విద్యా సంస్థల్లో ఎలాంటి ఫీజులు పెంచడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం జీవో 46 విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించారు. ఈ ఏడాది (2019-20) ఫీజులను కేవలం నెలవారీగా మాత్రమే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వసూలు చేయాలని సూచించింది. ఈ ఆదేశాలను ప్రయివేటు విద్యా సంస్థలు పాటించకుంటే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖాధికారులు తమ కార్యాలయాల్లో బుధవారం ఫిర్యాదుల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఫీజుల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తే ప్రయివేటు విద్యా సంస్థలపై జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి తమ ఫిర్యాదు చేయవచ్చు.
ఫిర్యాదు చేయాల్సిన నంబర్లు :
హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం 040 – 2970 1474, మేడ్చల్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం 94401 24369 .
Tags: Covid 19 effect, school fee, Hyd DEO, Call centre, Medchal DEO