‘ఎంపీలో ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక యువతకే’

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ఆ రాష్ట్ర యువతకే రిజర్వ్ అయ్యేలా నిర్ణయం తీసుకున్నట్టు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఇందుకు అనుగుణమైన చట్టపరమైన నిబంధనలు రూపొందించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని వనరులు రాష్ట్ర ప్రజలకోసమేనని అన్నారు.10వ, 12వ తరగతి ఉత్తీర్ణులైన స్థానిక యువతకే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఈ నిర్ణయానికి సంబంధించి మంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ రోజు చర్చించారు.

Update: 2020-08-18 05:40 GMT

Tags:    

Similar News