ప్రభుత్వ టెలికాం సంస్థల ఆస్తుల విక్రయం మొదలు

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లకు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ విక్రయాలకు సంబంధించి సాధ్యాసాధ్యాల కోసం తొలి అడుగుగా ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనెజ్‌మెంట్(డీఐపీఏఎం) ఇదివరకే కన్సల్టెంట్‌ను నియమించింది. సీబీఆర్ఈ, జేఎల్ఎల్, నైట్ ఫ్రాంక్ కంపెనీలను కన్సల్టెంట్‌లుగా ఉండనున్నాయి. జులై చివరినాటికి ఈ కన్సల్టెంట్ సంస్థలు ఆస్తుల విక్రయ వ్యవహారం లాభదాయకమా లేదా అనే అంశాన్ని పరిశీలించి, నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నాయి. […]

Update: 2020-07-08 04:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లకు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ విక్రయాలకు సంబంధించి సాధ్యాసాధ్యాల కోసం తొలి అడుగుగా ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనెజ్‌మెంట్(డీఐపీఏఎం) ఇదివరకే కన్సల్టెంట్‌ను నియమించింది. సీబీఆర్ఈ, జేఎల్ఎల్, నైట్ ఫ్రాంక్ కంపెనీలను కన్సల్టెంట్‌లుగా ఉండనున్నాయి. జులై చివరినాటికి ఈ కన్సల్టెంట్ సంస్థలు ఆస్తుల విక్రయ వ్యవహారం లాభదాయకమా లేదా అనే అంశాన్ని పరిశీలించి, నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువలతో ఆస్తుల విలువను పరిశీలిస్తారు. ఆ తర్వాతే ఆస్తుల అమ్మకాలకు కంపెనీలు ప్రాధాన్యత ఇస్తాయి. ఇటీవల ప్రధానితో జరిగిన సమావేశంలో ఈ రెండు సంస్థల విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 37,500 కోట్ల ఆదాయం సమకూర్చుకోగలదని అంచనా వేశాయి. దీంతో టెలికాం శాఖ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లకు చెందిన ఆస్తులను విక్రయించే ప్రక్రియను వేగవంతం చేసింది. బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్‌ఎల్ ఆస్తుల అమ్మకం ద్వారా ఆర్థికంగా ఒత్తిడికి గురైన రాష్ట్ర టెలికాం విభాగాలకు ప్యాకేజీలను అందించేందుకు ప్రభుత్వానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News