ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు విషయంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. కొవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. కంపెనీలకు కూడా రిటర్నుల దాఖలు చేసేందుకు నవంబర్ 30 వరకు అవకాశం ఇస్తూ, కరోనా సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందుల నుంచి వెసులుబాటు కల్పిస్తున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) పేర్కొంది. ఇదివరకు వ్యక్తిగత […]

Update: 2021-05-20 09:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు విషయంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. కొవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. కంపెనీలకు కూడా రిటర్నుల దాఖలు చేసేందుకు నవంబర్ 30 వరకు అవకాశం ఇస్తూ, కరోనా సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందుల నుంచి వెసులుబాటు కల్పిస్తున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) పేర్కొంది.

ఇదివరకు వ్యక్తిగత రిటర్నుల దాఖలు కోసం జులై 31, కంపెనీలకు అక్టోబర్ 31 వరకు గడువు ఉండేది. దీంతోపాటు కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే ఫారమ్-16 గడువును కూడా జులై 15 వరకు గడువును పొడిగిస్తూ సీబీడీటీ నిర్ణయం తీసుకుంది. పన్ను ఆడిట్ నివేదిక దాఖలును సైతం అక్టోబర్ 31 వరకు పొడిగించింది. అంతేకాకుండా, ఆర్థిక సంస్థల స్టేట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్(ఎస్ఎఫ్‌టీ) నివేదికను జూన్ 30 వరకు, సవరించిన ఆదాయ రిటర్న్ దాఖలు కోసం 2022, జనవరి 31 వరకు గడువు పొడిగించినట్టు సీబీడీటీ వెల్లడించింది.

 

Tags:    

Similar News