19న కాంట్రాక్ట్ ఉద్యోగుల ‘చలో హైదరాబాద్’

దిశ, హైదరాబాద్: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జె.వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తొలి పీఆర్సీ 2018 జులై నుంచి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పీఆర్సీకి అనుగుణంగా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు […]

Update: 2020-03-14 02:19 GMT

దిశ, హైదరాబాద్: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జె.వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తొలి పీఆర్సీ 2018 జులై నుంచి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పీఆర్సీకి అనుగుణంగా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా వేతనాలు పెంచాలన్నారు. ఈ నెల 19న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు సమీపంలోని ధర్నాచౌక్‌లో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం ఉంటుందన్నారు.

Tags: contract empioyees, chalo hyderabad, ts news

Tags:    

Similar News