పంట రుణాలపై కేంద్రం ఊరట!

దిశ, వెబ్‌డెస్క్ : మార్చి 1 నుంచి మే 31 మధ్య చెల్లింపుల్లో రైతులందరికీ వడ్డీ ఉపసంహరణ, సత్వర ప్రోత్సాహక ప్రయోజనాన్ని అందించాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. ప్రస్తుతం లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న కారణంగా చాలామంది రైతులు స్వల్పకాలిక పంట రుణాల బకాయిల చెల్లింపుల కోసం బ్యాంకులకు వెళ్లలేకపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ. 3 లక్షల లోపు పంట రుణాలపై ప్రభుత్వం వడ్డీ ఉపసంహరణ, రీపేమెంట్ ప్రోత్సహక ప్రయోజనాన్ని అందించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. […]

Update: 2020-04-21 07:32 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మార్చి 1 నుంచి మే 31 మధ్య చెల్లింపుల్లో రైతులందరికీ వడ్డీ ఉపసంహరణ, సత్వర ప్రోత్సాహక ప్రయోజనాన్ని అందించాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. ప్రస్తుతం లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న కారణంగా చాలామంది రైతులు స్వల్పకాలిక పంట రుణాల బకాయిల చెల్లింపుల కోసం బ్యాంకులకు వెళ్లలేకపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ. 3 లక్షల లోపు పంట రుణాలపై ప్రభుత్వం వడ్డీ ఉపసంహరణ, రీపేమెంట్ ప్రోత్సహక ప్రయోజనాన్ని అందించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రైతులు జరిమానా వడ్డీని చెల్లించనవసరం లేదని, కొవిడ్-19 ప్యాకేజీలో భాగంగా వడ్డీ ఉపసంహరణ పథకం నుంచి ప్రయోజనాలను పొందవచ్చని వెల్లడించింది. ప్రభుత్వం బ్యాంకుల ద్వారా పంట రుణాలతో రాయితీతో పాటు రెండు శాతం వడ్డీని సమకూర్చుతుంది. సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు అదనపు ప్రయోజనాలను ఇవ్వనుంది. ఇంతకుముందు ఆర్‌బీఐ రిటైల్ రుణాలపై మార్చి 1 నుంచి మే 31 మధ్య వాయిదాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.

Tags: Farmers, government, interest subvention, Prompt Repayment Incentive, RBI

Tags:    

Similar News