ముఖ్యమంత్రిని కలిసిన ఆ లెక్చరర్లు

దిశ ప్రతినిది, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి సూచనల మేరకు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సదా శివయ్య, జూనియర్ కాలేజ్ లెక్చరర్ రఘురామ్ శుక్రవారం సీఎంను ప్రగతి భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి సంబంధించిన వివరాలు సీఎం కేసీఆర్ లెక్చరర్ సదశివయ్యని అడిగి తెలుసుకుని ఆయను అభినదించారు. అలాగే డిగ్రీ కాలేజ్‌లో బొటానికల్ గార్డెన్ అభివృద్ధి కోసం రూ.50 లక్షలు మంజూరు చేశారు. […]

Update: 2020-07-17 07:49 GMT

దిశ ప్రతినిది, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి సూచనల మేరకు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సదా శివయ్య, జూనియర్ కాలేజ్ లెక్చరర్ రఘురామ్ శుక్రవారం సీఎంను ప్రగతి భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి సంబంధించిన వివరాలు సీఎం కేసీఆర్ లెక్చరర్ సదశివయ్యని అడిగి తెలుసుకుని ఆయను అభినదించారు. అలాగే డిగ్రీ కాలేజ్‌లో బొటానికల్ గార్డెన్ అభివృద్ధి కోసం రూ.50 లక్షలు మంజూరు చేశారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ సదర్భంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… తన సొంత ఖర్చులతో బాలికల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బాదేపల్లిలో మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయం సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం జూనియర్ కాలేజ్ లెక్చరర్ రఘురామ్ తమ సొంత ఖర్చులతో జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్న విషయం తెలియచేశారు. ఈ సందర్భంగా రఘురాంని సీఎం కేసీఆర్ అభినందించారు. అలాగే అన్ని కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని, ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థుల్లో అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి అభ్యర్ధన మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

Tags:    

Similar News