Somarapu satyanarayana: ప్రభుత్వం కీలక నిర్ణయం.. TRS ఎమ్మెల్యేకు ముచ్చెమటలు
దిశ ప్రతినిధి, కరీంనగర్: రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటులో ఎమ్మెల్యే వైఫల్యం చెందాడంటూ ప్రతిపక్షాలు నిరసనలకు దిగుతున్నాయి. ఎన్నికల మేనిఫేస్టోలో ప్రకటించినట్టుగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీల జాబితాలో రామగుండం లేకపోవడం ప్రతిపక్ష నాయకులకు పాశుపాతాస్త్రం అందించినట్టయింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గోదావరిఖనిలో నిరసనలకు శ్రీకారం చుట్టాయి. మేనిపేస్టోలో చెప్పింది ఏంటీ..? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎఫ్ బి నుండి పోటీ చేసిన కోరుకంటి చందర్ ప్రత్యేకంగా మేనిఫేస్టోను విడుదల చేశారు. […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటులో ఎమ్మెల్యే వైఫల్యం చెందాడంటూ ప్రతిపక్షాలు నిరసనలకు దిగుతున్నాయి. ఎన్నికల మేనిఫేస్టోలో ప్రకటించినట్టుగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీల జాబితాలో రామగుండం లేకపోవడం ప్రతిపక్ష నాయకులకు పాశుపాతాస్త్రం అందించినట్టయింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గోదావరిఖనిలో నిరసనలకు శ్రీకారం చుట్టాయి.
మేనిపేస్టోలో చెప్పింది ఏంటీ..?
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎఫ్ బి నుండి పోటీ చేసిన కోరుకంటి చందర్ ప్రత్యేకంగా మేనిఫేస్టోను విడుదల చేశారు. తనను గెలిపిస్తే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయిస్తానని అందులో పేర్కొన్నారు. అయితే ఈసారి ప్రభుత్వం కేటాయించిన లిస్టులో రామగుండం పేరు లేకపోవడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మెడికల్ కాలేజీ గురించి ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో రెండో కార్మిక క్షేత్రంగా భాసిల్లతున్న రామగుండంలో వైద్య సేవలు మెరుగు అవుతాయని స్థానికులు ఆశించారు. కానీ చివరికి ప్రభుత్వం మాత్రం ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయలేదు.
ఇస్తామన్న చోట వదిలి…
ఈ సారి ప్రభుత్వం మెడికల్ కాలేజీ కేటాయింపు విషయంలో ఇస్తామన్న చోటును పక్కనపెట్టి ప్రస్తావన లేని ప్రాంతానికి కేటాయించడం గమనార్హం. రామగుండంను కాదని జగిత్యాలలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం రామగుండం వాసుల నిరసనకు కారణమైంది. వాస్తవంగా రామగుండంలో సింగరేణి విస్తరించి ఉండడంతో పాటు ఎన్టీపీసీ, ఆర్ఎఫ్ సీఎల్ లు ఉన్నాయి. ఉన్నత స్థాయి నుండి సాధారణ పౌరుల వరకు అన్ని వర్గాల వారూ ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. దీనికి తోడు 20 కిలో మీటర్ల దూంలోనే మంచిర్యాల జిల్లా ఉండడం, మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతాల నుండి రవాణా సౌకర్యం మెరుగు పడడంతో రామగుడం మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ విషయంలో ఇక్కడి ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది.
ఆ ప్రతిపాదనలు ఏమాయే..?
తొలిసారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రామగుండంలో సింగరేణి, ఎన్టీపీసీ సౌజన్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు కూడా మరుగున పడిపోయాయి. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అప్పుడే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్టయితే ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీల జాబితాలో రామగుండంకు స్థానం దక్కెదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.