కేసీఆర్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతంలోని ఆడపిల్లలకు నిధులు మంజూరు

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మిడ్ మానేరు ప్రాజెక్ట్ ముంపునకు గురైన ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎట్టకేలకు నెరవేర్చింది. 18 ఏళ్లు నిండిన యువతులకు కూడా పరిహారం ఇవ్వాలని బాధిత ప్రాంతాల వారు గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారికి బాసటగా నిలుస్తామని గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, ఈ హామీ ఇంత వరకూ నెరవేర్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై బాధిత ప్రాంతాల వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓ సారి […]

Update: 2021-07-03 06:34 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మిడ్ మానేరు ప్రాజెక్ట్ ముంపునకు గురైన ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎట్టకేలకు నెరవేర్చింది. 18 ఏళ్లు నిండిన యువతులకు కూడా పరిహారం ఇవ్వాలని బాధిత ప్రాంతాల వారు గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారికి బాసటగా నిలుస్తామని గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, ఈ హామీ ఇంత వరకూ నెరవేర్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై బాధిత ప్రాంతాల వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఓ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడలో పర్యటించినప్పుడు కూడా మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలంటూ కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, సీఎం కేసీఆర్ ఆదివారం సిరిసిల్ల సందర్శించనున్న నేపథ్యంలో రూ. 20 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మిడ్ మానేరు నిర్వాసిత గ్రామాల్లోని 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు ఈ పరిహారం అందించనున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

Tags:    

Similar News