‘మొహర్రం’కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
దిశ, తెలంగాణ బ్యూరో : మొహర్రం పండుగను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎలాంటి ఆంక్షలు లేవని, ఏనుగు ఊరేగింపు ఏర్పాట్లు మాత్రం చేయోద్దని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ డీఎస్ఎస్ భవన్‌లో ఆదివారం మొహర్రంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం సంప్రదాయం ప్రకారం మొహర్రం […]
దిశ, తెలంగాణ బ్యూరో : మొహర్రం పండుగను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎలాంటి ఆంక్షలు లేవని, ఏనుగు ఊరేగింపు ఏర్పాట్లు మాత్రం చేయోద్దని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ డీఎస్ఎస్ భవన్‌లో ఆదివారం మొహర్రంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పాల్గొని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం సంప్రదాయం ప్రకారం మొహర్రం వేడుక జరుగుతుందని వెల్లడించారు. గతేడాది కరోతో మొహర్రం వేడుకలను అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ముహర్రంకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని షియా సంస్థల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి రూ. 50 లక్షలు, వక్ఫ్ బోర్డు చైర్మన్ ముహమ్మద్ సలీమ్ రూ. 50 లక్షలను మొహర్రం ఏర్పాట్లకు బడ్జెట్ కేటాయించారు.
ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ పోలీసుల ఆరోగ్యం, వైద్యం, అగ్నిమాపక సేవలు, నీరు, విద్యుత్, మున్సిపాలిటీలు, ఇతర విభాగాల సన్నాహాలను సమీక్షించారు. సమావేశంలో యాకుత్‌పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి, ఎమ్మెల్సీ రియాజ్ ఉల్ హసన్ ఎఫండి, ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ షానవాజ్ ఖాసిం, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యుడు హనీఫ్ అలీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యుడు డాక్టర్ నిసార్ అఘా, షియా సంస్థల నాయకులు పాల్గొన్నారు.