ట్రబుల్ బెడ్‌రూమ్స్

దిశ బేగంపేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో లిఫ్టుల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. సనత్‌నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్‌పేట్ డివిజన్‌లోని అంబేద్కర్‌నగర్‌లో ఐదు అంతస్తుల నిర్మాణంలో లిప్టులు ఏర్పాటు చేసినప్పటికీ, వినియోగంలోకి తీసుకు రాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు బాధ వర్ణనాతీతం. డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ఆరు సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్‌కు అంకురార్ఫణ చేశారు. […]

Update: 2021-09-01 07:23 GMT

దిశ బేగంపేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో లిఫ్టుల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. సనత్‌నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్‌పేట్ డివిజన్‌లోని అంబేద్కర్‌నగర్‌లో ఐదు అంతస్తుల నిర్మాణంలో లిప్టులు ఏర్పాటు చేసినప్పటికీ, వినియోగంలోకి తీసుకు రాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు బాధ వర్ణనాతీతం.

డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ఆరు సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్‌కు అంకురార్ఫణ చేశారు. దీంతో త్వరితగతిన ఇండ్ల నిర్మాణ పనులు కూడ పూర్తయ్యాయి. దీంతో పేద ప్రజల్లో ఆనందం వెల్లువిరిసింది. ఈ సంవత్సరం జూన్ 26 తేదీన రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. లాటరీ పద్దతిన లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించారు. మొత్తం ఆరు బ్లాక్‌లలో 10 లిప్టులు ఉన్నప్పటికి వాటిని అందుబాటులోకి తీసుకురాలేదు. ఎప్పుడు తీసుకు వస్తారో అధికారులను అడిగితే సరిగా స్పందించటం లేదని వాపోతున్నారు.

నాణ్యతలేవు- స్థానిక కార్పొరేటర్

అంబేడ్కర్ నగర్ డబుల్ బెడ్ రూమ్‌లలో నెలకొన్న సమస్యలపై జీహెచ్ఎంసీ హౌసింగ్ అధికారులు, వాటర్ వర్స్క్ అధికారులతో మాట్లాడామని అతి త్వరలో సమస్యలు తీరుస్తామని చెప్పినట్లు రాంగోపాల్‌పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ వెల్లడించారు. అలాగే ఇంకా కొంత మంది లబ్ధిదారులకు ఇండ్లు కేటాయింపు జరగలేదని, వెంటనే వారికి కూడా ఇండ్లు కేటాయించాలని అధికారులను కోరారు.

పది రోజులలో పరిష్కారం- జీహెచ్ఎంసీ హౌసింగ్ ఏఈ

అంబేడ్కర్‌నగర్‌లో నెలకొన్న లిఫ్ట్, మంచి నీరు, 5వ అంతస్తుపై ప్లోరింగ్ మళ్ళీ వేసి సమస్యను పది రోజుల్లో సమస్య తీరుస్తామని జీహెచ్ఎంసీ హౌసింగ్ ఏఈ జగన్ వెల్లడించారు.

Tags:    

Similar News