తాజా జీవోతో ఇరకాటంలో జవహర్‌రెడ్డి
దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి సన్నిధిలో శనివారం నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టాల్సిన జవహర్రెడ్డి తాజాగా ఇచ్చిన జీవోలు తెరపైకి వచ్చాయి. శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ గా రిలీవ్ కానున్న ఆయన జారీ చేసిన ఓ జీవో వివాదాస్పదమైంది. డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో ఏ2, ఏ3గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరికి పోస్టింగ్ ఇచ్చారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల పిడియాట్రిక్స్ విభాగం ప్రొఫెసర్‌గా డాక్టర్ కిరీటి, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డాక్టర్శశి కుమార్‌ను వైద్యఆరోగ్య […]
దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి సన్నిధిలో శనివారం నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టాల్సిన జవహర్రెడ్డి తాజాగా ఇచ్చిన జీవోలు తెరపైకి వచ్చాయి. శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ గా రిలీవ్ కానున్న ఆయన జారీ చేసిన ఓ జీవో వివాదాస్పదమైంది. డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో ఏ2, ఏ3గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరికి పోస్టింగ్ ఇచ్చారు.
తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల పిడియాట్రిక్స్ విభాగం ప్రొఫెసర్‌గా డాక్టర్ కిరీటి, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డాక్టర్శశి కుమార్‌ను వైద్యఆరోగ్య శాఖ నియమించింది. ఇద్దరిపై సీఐడీ విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. శిల్ప ఆత్మహత్యకు వైద్య కళాశాల ప్రొఫెసర్ల వేధింపులే కారణమని ఆరోపణలున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసు సంచలనమైంది. 2018 ఆగస్టులో శిల్ప బలవన్మరణానికి పాల్పడ్డారు. వైద్యకళాశాల ప్రొఫెసర్ల వేధింపులే కారణమంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ వ్యహారంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. తాజాగా వైద్యులకు తిరిగి పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.