గ్రాడ్యుయేట్స్‌కు గూగుల్ ఇంటర్న్‌షిప్ ఆఫర్
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్.. ఫ్రెష్ గ్యాడ్యుయేట్స్‌కు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. ఇండియా మొత్తం మీద రెండు ప్రదేశాల్లో మాత్రమే ఈ అవకాశం కల్పిస్తుండగా.. బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్న విద్యార్థినీ విద్యార్థులు ఇందుకు అర్హులు. ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లాంటి టెక్నికల్ బ్రాంచ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్.. ఫ్రెష్ గ్యాడ్యుయేట్స్‌కు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. ఇండియా మొత్తం మీద రెండు ప్రదేశాల్లో మాత్రమే ఈ అవకాశం కల్పిస్తుండగా.. బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్న విద్యార్థినీ విద్యార్థులు ఇందుకు అర్హులు.
ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లాంటి టెక్నికల్ బ్రాంచ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు చేస్తున్నవారై ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ (జావా, సీ ప్లస్ ప్లస్, పైథాన్)తో పాటు ఎస్‌క్యూఎల్, స్ప్రింగ్, హైబర్‌నేట్, వెబ్ సర్వీసెస్, జావా స్క్రిప్ట్ తెలిసి ఉండాలి. ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాలు ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని అభివృద్ధి చేయడానికి పనిచేయాలి. హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో ఈ ఇంటర్న్‌షిప్‌కు అవకాశమిస్తోంది. పూర్తి వివరాలకు గూగుల్ అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు. దరఖాస్తుకు చివరి తేది 11 డిసెంబర్ 2020.