గత ఐదేళ్ల ఉచిత సర్వీస్‌కు గూగుల్ బ్రేక్
దిశ, వెబ్‌డెస్క్: గత ఐదేళ్లుగా ఉచితంగా అందిస్తోన్న ఓ సర్వీస్‌కు గూగుల్ త్వరలో బ్రేక్‌లు వేయనుంది. గూగుల్ ఫొటోస్‌లో ఇప్పటి వరకు ఫొటోలను స్టోర్ చేసుకునే మెమొరీ మీద ఎలాంటి పరిమితి లేదు. కానీ జూన్ 1, 2021 నుంచి కేవలం 15 జీబీ వరకే ఫొటోలను స్టోర్ చేసుకునేలా పరిమితి విధించనుంది. గూగుల్ డ్రైవ్ కొత్త పాలసీ నిబంధనల్లో భాగంగా ఈ పరిమితిని అమలు చేయనున్నారు. కేవలం గూగుల్ ఫొటోస్‌లో మాత్రమే కాదు గూగుల్ వర్క్‌స్పేస్ […]
దిశ, వెబ్‌డెస్క్: గత ఐదేళ్లుగా ఉచితంగా అందిస్తోన్న ఓ సర్వీస్‌కు గూగుల్ త్వరలో బ్రేక్‌లు వేయనుంది. గూగుల్ ఫొటోస్‌లో ఇప్పటి వరకు ఫొటోలను స్టోర్ చేసుకునే మెమొరీ మీద ఎలాంటి పరిమితి లేదు. కానీ జూన్ 1, 2021 నుంచి కేవలం 15 జీబీ వరకే ఫొటోలను స్టోర్ చేసుకునేలా పరిమితి విధించనుంది. గూగుల్ డ్రైవ్ కొత్త పాలసీ నిబంధనల్లో భాగంగా ఈ పరిమితిని అమలు చేయనున్నారు. కేవలం గూగుల్ ఫొటోస్‌లో మాత్రమే కాదు గూగుల్ వర్క్‌స్పేస్ డాక్యుమెంట్‌లు, స్ప్రెడ్‌షీట్‌ల విషయంలోనూ ఇదే పరిమితిని విధించనున్నట్టు తెలుస్తోంది. అలాగే కనీసం రెండేళ్ల పాటు లాగిన్ చేయని ఖాతాలలోని డేటాను కూడా పూర్తిగా తొలగించేలా గూగుల్ కొత్త పాలసీని రూపొందించింది.
అయితే జూన్ 1, 2021 వరకు గూగుల్ డ్రైవ్‌కు అప్‌లోడ్ అయ్యే ఫొటోస్, డాక్యుమెంట్‌లకు ఈ నిబంధన వర్తించదు. కాబట్టి గూగుల్ ఫొటోస్‌ను ఉపయోగించాలా లేదా మరేదైనా క్లౌడ్ స్టోరేజ్ ప్రొవైడర్‌ను ఆశ్రయించాలా అనే విషయాన్ని నిర్ణయించుకోవడానికి ఇప్పుడు కావాల్సినంత సమయం ఉంది. వాట్సాప్ ద్వారా పంపిన ఫొటోల క్వాలిటీలో తేడా ఉంటుంది. కానీ గూగుల్ ఫొటోస్ ద్వారా షేర్ చేసుకున్న ఫొటోల క్వాలిటీలో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి ఎక్కువ మంది ఈ స్టోరేజ్‌ను ఉపయోగిస్తారు. అలాగే ఇంతకాలం ఇది ఫ్రీగా అందుబాటులో ఉండటంతో ఏ ఫొటోను పడితే ఆ ఫొటోను క్లౌడ్‌లో చేర్చారు. ఇక ఈ పాలసీ అమల్లోకి వచ్చాక ఆ అవకాశం ఉండదు కాబట్టి ఆటోమేటిక్ క్లౌడ్ సింక్ ఆప్షన్‌ను డిజేబుల్ చేయాల్సి రావొచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.