గూగుల్ ఫొటోస్‌లో న్యూ ఎడిటింగ్ ఫీచర్స్
దిశ, ఫీచర్స్ : గూగుల్ ఫోటోస్ తమ వినియోగదారుల కోసం న్యూ ఫీచర్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇటీవల కాలంలో ఆటోమేటెడ్ స్లైడ్ షోస్‌తో పాటు కొత్త ఎడిటింగ్ టూల్స్ ఇంట్రడ్యూస్ చేయగా.. ఇప్పుడు ఫొటోల్లోని నాయిస్ లెవెల్స్ తగ్గించడానికి, అస్పష్టంగా ఉన్న ఫొటోలను బెటర్ చేయడానికి ఉపయోగపడే ఫీచర్స్ తీసుకొచ్చింది. గూగుల్ ఫొటోస్‌లోని ఫొటో ‘ఎడిట్’ ఆప్షన్‌లో షార్పెన్, ‘డీనాయిస్’ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పటికే ఉన్నటువంటి ‘పాప్, విగ్నెట్’ అనే టూల్స్ మధ్యలో ఇవి కనిపిస్తాయి. […]
దిశ, ఫీచర్స్ : గూగుల్ ఫోటోస్ తమ వినియోగదారుల కోసం న్యూ ఫీచర్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇటీవల కాలంలో ఆటోమేటెడ్ స్లైడ్ షోస్‌తో పాటు కొత్త ఎడిటింగ్ టూల్స్ ఇంట్రడ్యూస్ చేయగా.. ఇప్పుడు ఫొటోల్లోని నాయిస్ లెవెల్స్ తగ్గించడానికి, అస్పష్టంగా ఉన్న ఫొటోలను బెటర్ చేయడానికి ఉపయోగపడే ఫీచర్స్ తీసుకొచ్చింది. గూగుల్ ఫొటోస్‌లోని ఫొటో ‘ఎడిట్’ ఆప్షన్‌లో షార్పెన్, ‘డీనాయిస్’ ఆప్షన్స్ కనిపిస్తాయి.
ఇప్పటికే ఉన్నటువంటి ‘పాప్, విగ్నెట్’ అనే టూల్స్ మధ్యలో ఇవి కనిపిస్తాయి. షార్పెన్ టూల్ బ్లర్రీ లైన్స్ తగ్గించడానికి, ఫొటోలోని ఔట్ ఆఫ్ ఫోకస్ ఎలిమెంట్స్ స్పష్టంగా చేయడానికి మీకు సాయపడుతుంది. డీనాయిస్ టూల్ ఫొటోను సాఫ్ట్‌గా చేయడంతో పాటు గ్రెయిన్ రెడ్యూస్ చేస్తుంది. షార్పెన్, డీనాయిస్ ఫీచర్స్ ఇప్పుడు క్రమంగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకవేళ యాప్‌లో అవి కనిపించకపోతే, గూగుల్ ఫొటోస్ యాప్ అప్‌డేట్ చేయాలి.