సరికొత్తగా గూగుల్ ఫొటోస్
దిశ, వెబ్‌డెస్క్ : ఆటో బ్యాకప్ ఆప్షన్‌కు గూగుల్ ఫొటోస్ ఇటీవలే గుడ్‌బై చెప్పింది. వాట్సాప్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ట్విట్టర్ లాంటి చాట్ యాప్స్‌లోనూ గూగుల్ ఫొటోలకు ఇకపై మీడియాను బ్యాకప్ చేయబోమని ప్రకటించింది. ఇందుకోసం గూగుల్ ఫొటోస్‌లో ‘డీఫాల్ట్’ సెట్టింగ్స్‌ను మార్చేసింది. దీంతో పాటు గూగుల్ ఫొటోస్ యాప్ రీడిజైన్ కూడా మరో కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రాబోతున్నట్టు గూగుల్ ప్రకటించింది. పుస్తకాలను మనం లైబ్రరీలో దాచుకున్నట్లే.. ఫోన్‌లోని అన్ని రకాల ఫొటోలను ‘గూగుల్ […]
దిశ, వెబ్‌డెస్క్ : ఆటో బ్యాకప్ ఆప్షన్‌కు గూగుల్ ఫొటోస్ ఇటీవలే గుడ్‌బై చెప్పింది. వాట్సాప్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ట్విట్టర్ లాంటి చాట్ యాప్స్‌లోనూ గూగుల్ ఫొటోలకు ఇకపై మీడియాను బ్యాకప్ చేయబోమని ప్రకటించింది. ఇందుకోసం గూగుల్ ఫొటోస్‌లో ‘డీఫాల్ట్’ సెట్టింగ్స్‌ను మార్చేసింది. దీంతో పాటు గూగుల్ ఫొటోస్ యాప్ రీడిజైన్ కూడా మరో కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రాబోతున్నట్టు గూగుల్ ప్రకటించింది.
పుస్తకాలను మనం లైబ్రరీలో దాచుకున్నట్లే.. ఫోన్‌లోని అన్ని రకాల ఫొటోలను ‘గూగుల్ ఫొటోస్’లో భద్రపరుచుకుంటాం. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇది ఓ ఫొటో లైబ్రరీ. ఇంతకుముందు.. మొబైల్‌లో సేవ్ చేసిన ఫొటోలు, వీడియోలు గూగుల్ ఫొటోస్‌లో ‘ఆటో సేవ్’ అయ్యేవి. అయితే కెమెరా ఫొటోలతో పాటు ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన.. వివిధ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్‌ల నుంచి మన ఫోన్‌లో సేవ్ చేసిన ఇమేజ్‌లను కూడా బ్యాకప్ తీసుకునేది. ఇవి ఆటోమేటిక్‌గా సేవ్ కాకుండా ఉండాలంటే మాన్యువల్‌గా ‘ఆఫ్’ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడిక ఆ అవసరం లేదు.
గూగుల్ ఫొటోస్ రీడిజైన్ విషయానికొస్తే.. ఫొటోస్, సెర్చ్, లైబ్రరీ పేజెస్ అనే మూడు ట్యాబ్‌లతో దీన్ని డిజైన్ చేసింది.
సెర్చ్ ట్యాబ్..
ఇది మిడిల్‌లో ఉంటుంది. మనం సందర్శించిన వివిధ ప్లేస్‌లతో పాటు ప్రముఖ ప్రదేశాలను చూపిస్తుంది. మన ఫొటో లైబ్రరీలోని వ్యక్తుల్ని ఇది ఈజీగా వెతికి పెడుతుంది.
మెమోరీస్..
ఇది ఇంతకుముందు నుంచే ఉన్నా.. ప్రస్తుతం దీన్ని మరింత డెవలప్ చేసింది. ప్రతి సంవ్సతరంలో మన బెస్ట్ ఇమేజెస్‌తో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫొటోలను మనకు గుర్తు చేస్తుంది. మన ఫొటోలతో కొలాగ్స్, యానిమేషన్స్‌తో పాటు మూవీస్‌ను కూడా అందిస్తుంది.
ఇంటారాక్టివ్ మ్యాప్..
వీడియోలు కానీ, ఫొటోలు కానీ.. ఏరియాను బట్టి షో చేస్తాయి. అవి ఏ రోజు, ఏ టైమ్‌కు తీశారు. అప్పుడు మీరు ఏ ప్రదేశంలో ఉన్నారు? వంటి విషయాలను ఇది తెలియజేస్తుంది. ఇందుకోసం లొకేషన్ ఆన్ చేయాల్సి ఉంటుంది. మాన్యువల్‌గా కూడా లోకేషన్ యాడ్ చేసే సౌకర్యం ఉంది. లొకేషన్ కనిపించకూడదని అనుకున్నవాళ్లు.. కెమెరా లొకేషన్ స్విచ్ ఆఫ్‌లో పెడితే చాలు.
లైబ్రరీ :
ఇందులో చాలా ట్యాబ్స్ ఉన్నాయి. లైక్.. ఫేవరెట్స్, ఆల్బమ్స్, ట్రాష్, ఆర్చివ్.