గూగుల్ నుంచి గుడ్‌న్యూస్.. అప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ డెల్టా ఆందోళనల నేపథ్యంలో ఆఫీస్ రీ-ఓపెన్ ప్లాన్ ప్రకారం ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించే ప్రక్రియ వాయిదా వేయడంపై స్పష్టత ఇచ్చింది. సంస్థలోని ఉద్యోగులందరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికోసం 2022, జనవరి వరకు మెజారిటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించనున్నట్టు గూగుల్ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ డెల్టా ఆందోళనల నేపథ్యంలో ఆఫీస్ రీ-ఓపెన్ ప్లాన్ ప్రకారం ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించే ప్రక్రియ వాయిదా వేయడంపై స్పష్టత ఇచ్చింది. సంస్థలోని ఉద్యోగులందరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికోసం 2022, జనవరి వరకు మెజారిటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించనున్నట్టు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి తర్వాత స్థానిక పరిస్థితులను బట్టి ఆయా దేశాల్లో ఈ విధానంపై నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన వివరించారు.
సుందర్ పిచాయ్ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ ప్రకారం.. 2022, జనవరి 10 తర్వాత పలు దేశాల్లోని పరిస్థితులను అంచనా వేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించడంపై ఆలోచిస్తామని’ పేర్కొన్నారు. ఇదివరకు గూగుల్ సంస్థ జూలై నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తేయాలని భావించింది. అయితే, ఉద్యోగులందరికీ పూర్తిగా వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరి అనే నిబంధనతో సంస్థ నిర్ణయాన్ని వాయిదా వేసింది. కాగా, ఇటీవల కొవిడ్ డెల్టా వేరియంట్ ఆందోళన నేపథ్యంలో అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆఫీసులకు వచ్చేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపించకపోవడంతో ఇప్పటికే అమెజాన్ లాంటి సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తామని ప్రకటించాయి. ఇంకా ఇతర బడా సంస్థలు కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నాయి.