మంచి రోడ్లు రాష్ట్ర ప్రగతికి చిహ్నం
దిశ, హైదరాబాద్ మంచి రోడ్లు రాష్ట్ర ప్రగతిని సూచిస్తాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. గత ఆరేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కనీ వినీ ఎరుగని రీతిలో రోడ్లు బాగు చేయటానికి, రోడ్డు వ్యవస్థ ను అభివృద్ధి చేయటానికి పూనుకున్నారు. ఇప్పటికే 10800 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ఎవరూ వినతిపత్రం ఇవ్వకుండానే […]
దిశ, హైదరాబాద్
మంచి రోడ్లు రాష్ట్ర ప్రగతిని సూచిస్తాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. గత ఆరేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కనీ వినీ ఎరుగని రీతిలో రోడ్లు బాగు చేయటానికి, రోడ్డు వ్యవస్థ ను అభివృద్ధి చేయటానికి పూనుకున్నారు. ఇప్పటికే 10800 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ఎవరూ వినతిపత్రం ఇవ్వకుండానే బ్రిడ్జ్ ల సమస్యపై వాటి స్థానంలో కొత్త బ్రిడ్జ్ ల నిర్మాణం చెయ్యాలని చెప్పటం టీఆర్ ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. 414 బ్రిడ్జ్ ల నిర్మాణానికి దాదాపు 2797కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు చెప్పారు. మంజీర ,గోదావరి, మానేరు,ప్రాణహిత, మున్నేరు,అకేరు, మూసి, తుంగభద్ర ఇటువంటి నదుల పై భారీ వంతెనలు నిర్మించుకున్నట్టు వివరించారు. రాష్ట్రంలో 26 భారీ వంతెనలకు 9084 కోట్ల రూపాయలు మంజూరు చేయగా ఇప్పటికే 16 వంతెనలు పూర్తి చేసుకున్నామని తెలిపారు.
Tags: minister vemula prashanth reddy, assembly question hour, many road developed in 6 years