తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మికులకు ఎట్టకేలకు వేతనాలు జమ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేతనాల కోసం కార్మికులు డిపోల ముందట ఆందోళన చేపట్టారు. వేతనాలు విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని ఆయా డిపోల ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచిన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మాత్రం అన్యాయం చేస్తుందని విమర్శించారు. అసెంబ్లీ […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మికులకు ఎట్టకేలకు వేతనాలు జమ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేతనాల కోసం కార్మికులు డిపోల ముందట ఆందోళన చేపట్టారు. వేతనాలు విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని ఆయా డిపోల ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచిన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మాత్రం అన్యాయం చేస్తుందని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా వేతనాలు పెంచుతామన్న సీఎం… ఇప్పటి వరకూ దానిపై ఎలాంటి ప్రకటన చేయడం లేదన్నారు. ఓవైపు వేతనాల పెంపు అలాగే ఉండగా… ప్రతినెలా మొదటివారంలో వేయాల్సిన జీతాలను ప్రతినెలా 15వ తేదీ దాటిన తర్వాతే జమ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల కూడా బుధవారం వరకు వేతనాలు రాలేదన్నారు. కాగా వేతనాల కోసం ఆందోళన చేయగా… బుధవారం సాయంత్రం ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల ఖాతాల్లో జీతాలు జమ చేసింది.