గుడ్‌న్యూస్: ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పేదల ఇళ్ల నిర్మాణాలకు మార్గం సుగమం చేస్తూ.. హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల 8వ తేదీన ‘పేదలందరికీ స్థలాలు’ పథకంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ క్రమంలో దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ జగన్‌ మోహన్‌ […]

Update: 2021-11-30 00:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పేదల ఇళ్ల నిర్మాణాలకు మార్గం సుగమం చేస్తూ.. హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల 8వ తేదీన ‘పేదలందరికీ స్థలాలు’ పథకంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ క్రమంలో దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయింది. మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన 128 పిటిషన్లను డివిజన్ బెంచ్ కొట్టేసింది.

Tags:    

Similar News