ఎస్‌బీఐ ఖాతాదారులకు తీపి కబురు!
దిశ, వెబ్‌డెస్క్: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు అద్దిరిపోయే శుభవార్త ప్రకటించింది. పొదుపు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు నిర్ణయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా పొదుపు ఖాతాలపై వడ్డీరేటును ఏడాదికి 3 శాతంగా నిర్ణయించినట్టు స్పష్టం చేసింది. వీటితో పాటు ఎస్ఎమ్ఎస్ ఛార్జీలను కూడా మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదివరకూ ఎస్‌బీఐ సేవింగ్స్ బ్యాలెన్స్ ఖాతాదారులకు మెట్రో ప్రాంతాల్లో రూ. 3000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 2000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. […]
దిశ, వెబ్‌డెస్క్: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు అద్దిరిపోయే శుభవార్త ప్రకటించింది. పొదుపు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు నిర్ణయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా పొదుపు ఖాతాలపై వడ్డీరేటును ఏడాదికి 3 శాతంగా నిర్ణయించినట్టు స్పష్టం చేసింది. వీటితో పాటు ఎస్ఎమ్ఎస్ ఛార్జీలను కూడా మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదివరకూ ఎస్‌బీఐ సేవింగ్స్ బ్యాలెన్స్ ఖాతాదారులకు మెట్రో ప్రాంతాల్లో రూ. 3000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 2000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1000గా ఉన్న కనీస నిల్వను ఉంచాలనే నిబంధన ఉండేది. అలా లేని పక్షంలో రూ. 5 నుంచి రూ. 15 వరకూ జరిమానా విధించేది. వీటన్నిటినీ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
Tags: sbi, Minimum Balance, Saving accounts