భగ్గుమన్న బంగారం!
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ధరలు మళ్లీ మండుతున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మదుపర్లలో ఆందోళన పెరిగింది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందన్న కారణాలతో పెట్టుబడిదారులు మార్కెట్లను వీడి బంగారంపై ఆసక్తి చూపిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో పది గ్రాముల బంగారం రూ. 773 వరకూ పెరిగి రూ. 45,343కు చేరుకుంది. వెండి స్వల్పంగా రూ. 192 పెరిగి రూ. 48,180కి చేరుకుంది. ఎంసీఎక్స్‌లో బంగారం ధర అల్‌టైమ్ హైని నమోదు చేసింది. రెండు […]
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ధరలు మళ్లీ మండుతున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మదుపర్లలో ఆందోళన పెరిగింది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందన్న కారణాలతో పెట్టుబడిదారులు మార్కెట్లను వీడి బంగారంపై ఆసక్తి చూపిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో పది గ్రాముల బంగారం రూ. 773 వరకూ పెరిగి రూ. 45,343కు చేరుకుంది. వెండి స్వల్పంగా రూ. 192 పెరిగి రూ. 48,180కి చేరుకుంది.
ఎంసీఎక్స్‌లో బంగారం ధర అల్‌టైమ్ హైని నమోదు చేసింది. రెండు రోజుల్లో పసిడి ధరలు వెయ్యి రూపాయలకు పైగా పెరగడం గమనార్హం. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే వారంలోనే పసిడి ధర రూ. 46,000లను కూడా దాటేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా ధాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం రూ. 17 డాలర్లకు పైగా పెరిగి 1,678కు చేరుకుంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో కోత పెట్టడంతో ఎక్కువగా బంగారంపై పెట్టుబడులు మళ్లుతున్నాయి. బంగారానికి తోడు రూపాయి మారకం విలువ సైతం మరింత క్షీణిస్తోంది. శుక్రవారం రూపాయి మారకం విలువ 65 పైసలు తగ్గి రూ. 77.99 వద్ద ఉంది.
Tags : Gold price today, Yellow metal climbs higher, amid rising virus fears