1.16కేజీల బంగారం పట్టివేత..

దిశ, వెబ్‌డెస్క్ : చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుంచి చెన్నైకి వచ్చిన ఓ గ్యాంగ్ అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పార్సెల్ బాక్స్‌లోని ఎలక్ట్రిక్ మెషిన్‌లో బంగారాన్నిపెట్టి రవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బంగారానికి సంబంధించి.. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు నిర్దారించారు. పట్టుబడ్డ ఎలక్ట్రిక్ మెషీన్‌లో 1.16 కేజీల బంగారం లభ్యం కాగా, దాని విలువ సుమారు రూ. […]

Update: 2020-08-28 11:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుంచి చెన్నైకి వచ్చిన ఓ గ్యాంగ్ అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పార్సెల్ బాక్స్‌లోని ఎలక్ట్రిక్ మెషిన్‌లో బంగారాన్నిపెట్టి రవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ బంగారానికి సంబంధించి.. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు నిర్దారించారు. పట్టుబడ్డ ఎలక్ట్రిక్ మెషీన్‌లో 1.16 కేజీల బంగారం లభ్యం కాగా, దాని విలువ సుమారు రూ. 64 లక్షలు ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఈ కేసులో తిరువారూర్‌కు చెందిన హుస్సేన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News