అరంగేట్రంలోనే అదరగొట్టిన గో ఫ్యాషన్..
దిశ, వెబ్‌డెస్క్: స్టాక్ మార్కెట్‌లో అస్థిరత ఉన్నప్పటికి గో ఫ్యాషన్ షేర్లు అదరగొట్టాయి. ప్రారంభంలోనే 81% అధికంగా నమోదు అయ్యింది. ప్రారంభ ఇష్యూ ధర ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.655-690. మంగళవారం నాటి లిస్టింగ్‌లో షేరు 81.70 శాతం లాభంతో రూ.1,253.70 వద్ద ముగిసింది. మహిళల బాటమ్ వేర్ బ్రాండ్ గో కలర్స్ ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,014 కోట్లను సమీకరించింది. కంపెనీ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ.. “గో కలర్స్ డిజిటల్ & […]
దిశ, వెబ్‌డెస్క్: స్టాక్ మార్కెట్‌లో అస్థిరత ఉన్నప్పటికి గో ఫ్యాషన్ షేర్లు అదరగొట్టాయి. ప్రారంభంలోనే 81% అధికంగా నమోదు అయ్యింది. ప్రారంభ ఇష్యూ ధర ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.655-690. మంగళవారం నాటి లిస్టింగ్‌లో షేరు 81.70 శాతం లాభంతో రూ.1,253.70 వద్ద ముగిసింది. మహిళల బాటమ్ వేర్ బ్రాండ్ గో కలర్స్ ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,014 కోట్లను సమీకరించింది. కంపెనీ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ.. “గో కలర్స్ డిజిటల్ & ఓమ్ని-చానెల్ ఎంగేజ్‌మెంట్‌లో పెట్టుబడి పెట్టింది. కంపెనీ విస్తరణ కోసం గ్రోత్ స్ట్రాటజీపై దృష్టి సారించింది. పని చేసే మహిళల సంఖ్య పెరుగుతుండటం, మార్కెట్ల నుంచి రాబడి పెరగడం అనేది వృద్ధికి తోడ్పడుతుంది” అని అన్నారు.