జీఎంఆర్‌కు స్టాక్ ఎక్స్ఛేంజీల అనుమతి
దిశ, వెబ్‌డెస్క్: వ్యాపారాలను పునర్వ్యవస్థీకరించేందుకు మౌలిక రంగ దిగ్గజ సంస్థ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేసిన ప్రతిపాదనలను స్టాక్ ఎక్స్ఛేంజీలు ఆమోదించినట్టు కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా జీఎంఆర్ కంపెనీ విమానాశ్రయం కాని వ్యాపారాలను ప్రత్యేకంగా విడదీయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. దీని పట్ల ఎలాంటి అభ్యంతరాలు లేవని ఎక్స్ఛెంజీలు వెల్లడించినట్టు కంపెనీ తెలిపింది. ఈ ప్రతిపాదనల్లో జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జీఎంఆర్ పవర్ ఇన్‌ఫ్రా, జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రా విభాగాలకు సంబంధించి సర్దుబాట్లు, విలీనం చేసే […]
దిశ, వెబ్‌డెస్క్: వ్యాపారాలను పునర్వ్యవస్థీకరించేందుకు మౌలిక రంగ దిగ్గజ సంస్థ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేసిన ప్రతిపాదనలను స్టాక్ ఎక్స్ఛేంజీలు ఆమోదించినట్టు కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా జీఎంఆర్ కంపెనీ విమానాశ్రయం కాని వ్యాపారాలను ప్రత్యేకంగా విడదీయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. దీని పట్ల ఎలాంటి అభ్యంతరాలు లేవని ఎక్స్ఛెంజీలు వెల్లడించినట్టు కంపెనీ తెలిపింది. ఈ ప్రతిపాదనల్లో జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జీఎంఆర్ పవర్ ఇన్‌ఫ్రా, జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రా విభాగాలకు సంబంధించి సర్దుబాట్లు, విలీనం చేసే చర్యలను అమలు చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది.
ఈ ప్రతిపాదనలపై 6 నెలల్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కు దరఖాస్తు చేయనున్నట్టు జీఎంఆర్ వివరించింది. కాగా, జీఎంఆర్ కంపెనీ గత ఆష్టులో వ్యూహాత్మక పునర్నిర్మాణ ప్రణాళికలకు సిద్ధమైంది. ఇదివరకే కార్పొరేట్ హోల్డింగ్ నిర్మాణాలను సులభతరం చేయడానికి విమానాశ్రయేతర వ్యాపారాన్ని విడదీయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. విమానాశ్రయం, విమానాశ్రయం కాని వ్యాపారాల ప్రత్యేక జాబితా కార్పొరేట్ హోల్డింగ్ నిర్మాణాన్ని సులభతరం చేయడానికి సహాయపడుతుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.