5శాతం ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన యాక్సెంచర్!

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్ సంస్థలోని 5శాతం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టులను తగ్గించడం సహా కొత్త నియామకాలను నిలిపేసి, ఇప్పటికే ఉన్న ఉద్యోగుల్లోంచి నైపుణ్యం లేని ఉద్యోగులను పంపించేయాలని సంస్థ అంతర్గత సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ప్రస్తుతం యాక్సెంచర్‌లో అంతర్జాతీయంగా 5లక్షల మంది ఉద్యోగులున్నారు. భారత్‌లో 2 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇటీవల పరిణామాలతో క్లయింట్లకు కేటాయించే పనిగంటలు భారీగా తగ్గినట్టు, నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు ఆందోళన […]

Update: 2020-08-26 10:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్ సంస్థలోని 5శాతం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టులను తగ్గించడం సహా కొత్త నియామకాలను నిలిపేసి, ఇప్పటికే ఉన్న ఉద్యోగుల్లోంచి నైపుణ్యం లేని ఉద్యోగులను పంపించేయాలని సంస్థ అంతర్గత సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ప్రస్తుతం యాక్సెంచర్‌లో అంతర్జాతీయంగా 5లక్షల మంది ఉద్యోగులున్నారు. భారత్‌లో 2 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇటీవల పరిణామాలతో క్లయింట్లకు కేటాయించే పనిగంటలు భారీగా తగ్గినట్టు, నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు ఆందోళన అక్కరలేదని సంస్థలోని సీనియర్ అధికారులు చెప్పారు. వృథా ఖర్చులను తగ్గించుకునేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని, సరఫరా-డిమాండ్ మధ్య వ్యత్యాసాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రతి ఏటా సంస్థలోని ఉద్యోగుల పనితీరును పరిశీలించే ప్రక్రియలో భాగంగా, క్లయింట్లతో వారి సంబంధాలు, మెరుగుదల, పురోగతి, సామర్థ్యం వంటి అంశాల గురించి చర్చించామని, సుదీర్ఘ కాలానికి ఉద్యోగులు ఎలాంటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారనే దాన్ని పరిశీలించామని సంస్థలోని అధికారులు వెల్లడించారు. సంస్థలోని 5శాతం నైపుణ్యం లేని వారిని తొలగించనున్నట్టు, వాటిని తిరిగి భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. భారత్‌లో నియామకాలను కొనసాగిస్తాం. అంతేకాకుండా..సంస్థలో బోనస్, ప్రమోషన్లకు అర్హులైన వారిని గుర్తించినట్టు యాక్సెంచర్ తెలిపింది.

Tags:    

Similar News