IPL : RCB కెప్టెన్ అతనే.. కోచ్ వెటోరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్-15(2022) సీజన్‌పై క్రికెట్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్లేయర్స్ ఇప్పటి వరకు ఉన్న ఫ్రాంచైజీలను వీడి కొత్త టీమ్స్‌లోకి వెళ్తున్న నేపథ్యంలో మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారనున్నాయి. ఇదిలా ఉండగా ఐపీఎల్‌లో కొన్ని జట్లకు ఈ సీజన్‌లో కెప్టెన్లు మారనున్నారు. RCB జట్టుకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టుకు కెప్టెన్ ఎవరు అనేది అభిమానుల్లో ఆస్తకిని పెంచింది. ఈ నేపథ్యంలో […]

Update: 2021-12-01 22:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్-15(2022) సీజన్‌పై క్రికెట్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్లేయర్స్ ఇప్పటి వరకు ఉన్న ఫ్రాంచైజీలను వీడి కొత్త టీమ్స్‌లోకి వెళ్తున్న నేపథ్యంలో మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారనున్నాయి. ఇదిలా ఉండగా ఐపీఎల్‌లో కొన్ని జట్లకు ఈ సీజన్‌లో కెప్టెన్లు మారనున్నారు. RCB జట్టుకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టుకు కెప్టెన్ ఎవరు అనేది అభిమానుల్లో ఆస్తకిని పెంచింది. ఈ నేపథ్యంలో RCB కోచ్​ డేనియల్​వెటోరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

కోహ్లీ బాధ్యతలను ఆసీస్ హిట్టర్ గ్లెన్ ​మ్యాక్స్‌వెల్ ​తీసుకునే అవకాశాలున్నాయని తెలిపాడు. RCBకి మాక్సీనే కెప్టెన్ అవుతాడంటూ వ్యాఖ్యానించాడు. గతేడాది ఐపీఎల్ సీజన్‌లో మ్యాక్స్‌వెల్​అద్భుతంగా రాణించాడని వెటోరి అన్నాడు. బిగ్​బాష్​ లీగ్‌లో మెల్​బోర్న్ స్టార్స్‌కు మాక్స్‌వెట్ నాయకత్వం వహించిన విషయాన్ని వెటోరి గుర్తు చేశాడు. మ్యాక్సీ సారథ్యంలో ఆ జట్టు 62 మ్యాచ్‌ల్లో 34 విజయం సాధించిందని వెటోరి కామెంట్స్ చేయడం విశేషం. అయితే.. ఐపీఎల్ రిటైన్డ్ లిస్ట్‌లో RCB జట్టులో కోహ్లీ(రూ.15కోట్లు), మ్యాక్స్‌వెల్(రూ.11కోట్లు), మహ్మద్​సిరాజ్​(రూ.7కోట్లు) ఉన్నారు.

అఖండ మూవీ రివ్యూ.. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన బాలయ్య

Tags:    

Similar News