తండ్రి ప్రాణాల కోసం తనయుడి తపన
ముంబయి : ‘నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ముందు మేం వరోరా ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ బెడ్లు లేవన్నారు. అక్కడ్నుంచి చంద్రాపూర్‌కు వెళ్లాం. అక్కడా అదే పరిస్థితి. అదే రాత్రి తెలంగాణకు వచ్చాం. ఇక్కడా ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. మా నాన్నకు హాస్పటల్ లో ఒక బెడ్ అయినా ఇవ్వండి. లేకుంటే ఆయనను చంపేయండి..’ కరోనా సోకిన తండ్రిని కాపాడుకునేందుకు ఓ తనయుడు పడుతున్న ఆవేదన ఇది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు గ్రామానికి చెందిన […]
ముంబయి : ‘నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ముందు మేం వరోరా ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ బెడ్లు లేవన్నారు. అక్కడ్నుంచి చంద్రాపూర్‌కు వెళ్లాం. అక్కడా అదే పరిస్థితి. అదే రాత్రి తెలంగాణకు వచ్చాం. ఇక్కడా ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. మా నాన్నకు హాస్పటల్ లో ఒక బెడ్ అయినా ఇవ్వండి. లేకుంటే ఆయనను చంపేయండి..’ కరోనా సోకిన తండ్రిని కాపాడుకునేందుకు ఓ తనయుడు పడుతున్న ఆవేదన ఇది.
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు గ్రామానికి చెందిన సాగర్ కిషోర్ తండ్రికి కరోనా పాజిటివ్ వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తండ్రిని అంబులెన్స్ లో ఎక్కించి దగ్గర్లోని వరోరా ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ బెడ్లు ఖాళీలేవని వైద్యులు చెప్పారు. దీంతో అతడు చంద్రాపూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అక్కడ కూడా అన్నీ ఫుల్. ప్రయివేటు ఆస్పత్రులలో కూడా అదే పరిస్థితి. ఇక లాభం లేదనుకుని సాయంత్రం అవుతండగా తెలంగాణకు బయలుదేరాడు. ఆదిలాబాద్‌కు తీసుకొచ్చేసరికి తెల్లవారుజామున 3 అయింది. ఇక్కడా సేమ్ సీన్. బెడ్లు లేక ఆస్పత్రుల ఎదుట రోగుల పడిగాపులు. సాగర్ ఆశలు అడియాసలే అయ్యాయి. తిరిగి చంద్రాపూర్ వెళ్లినా అక్కడ ఒక్క బెడ్డు కూడా ఖాళీ కాలేదు.
కాలికి బలపం కట్టుకుని తిరిగినట్టు దాదాపు రెండు రోజుల పాటు రెండు రాష్ట్రాలు తిరిగినా హాస్పటిల్స్ లో బెడ్లు ఖాళీ లేకపోవడంతో అతడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. చంద్రాపూర్ లో అతడిని కలిసిన మీడియా ప్రతినిదులతో మాట్లాడుతూ.. తన తండ్రిని ఆస్పత్రిలో అయినా చేర్చుకోవలని లేకుంటే ఆయనను చంపేయండని కన్నీరు మున్నీరయ్యాడు.
24 घंटे चक्कर लगाए, कहीं बेड नहीं!
बुज़ुर्ग मरीज़ के बेटे की गुहार, ‘या बेड दो या इंजेक्शन देकर मार दो!’
महाराष्ट्र के चंद्रपुर का हाल. pic.twitter.com/ZzxhlnzdZL
— Puja Bharadwaj (@Pbndtv) April 14, 2021