కరోనా నివారణ.. ఇదిగో నా కిడ్డీ బ్యాంక్
దిశ, కరీంనగర్: కరోనా నివారణకు దేశవ్యాప్తంగా పలువురు సెలెబ్రిటీల నుంచి సాధారణ పౌరులు సైతం విరాళాలు అందజేసేందుకు ముందుకు వస్తున్నారు. అందులోనూ చిన్నపిల్లలు కూడా ప్రభుత్వానికి తమ వంతు చిరు సాయం అందించడం అందరిచేత మన్ననలు పొందేలా చేస్తోంది. వివరాల్లోకివెళితే..జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన కట్కూరి అంజనా గత కొంతకాలంగా కిడ్డీ బ్యాంకులో దాచుకున్న సొమ్మును తన తండ్రికి అందజేసింది. శానిటైజర్ కిట్స్ కొనుగోలు చేసి కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరం కృషి చేస్తున్న విలేకరులకు […]
దిశ, కరీంనగర్: కరోనా నివారణకు దేశవ్యాప్తంగా పలువురు సెలెబ్రిటీల నుంచి సాధారణ పౌరులు సైతం విరాళాలు అందజేసేందుకు ముందుకు వస్తున్నారు. అందులోనూ చిన్నపిల్లలు కూడా ప్రభుత్వానికి తమ వంతు చిరు సాయం అందించడం అందరిచేత మన్ననలు పొందేలా చేస్తోంది. వివరాల్లోకివెళితే..జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన కట్కూరి అంజనా గత కొంతకాలంగా కిడ్డీ బ్యాంకులో దాచుకున్న సొమ్మును తన తండ్రికి అందజేసింది. శానిటైజర్ కిట్స్ కొనుగోలు చేసి కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరం కృషి చేస్తున్న విలేకరులకు అందించాలని తండ్రిని కోరింది. ఐదో తరగతి చదువుతున్న అంజనా.. తన ఔదార్యాన్ని ప్రదర్శించిన తీరును చూసిన రిపోర్టర్స్ ఆమె ఆలోచన విధానానికి, సమాజంలో పలువురికి సాయం చేయాలనుకునే ఆమె ధృక్ఫథాన్ని అభినందించారు.
Tags: reporter, kiddy bank, girl, corona, lockdown