ఢిల్లీ ఓటర్లకు బంపర్ ఆఫర్
ఎన్నికల వేళ తాయిళాలు ప్రకటించడం రాజకీయ పార్టీలకు కొత్తకాదు. ఓటర్లను బూత్ వరకు తీసుకువెళ్లేందుకు రకరకాల సదుపాయాలు కల్పిస్తుంటాయి. ఎన్నికల సంఘం ఎలాగూ కొన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. అయితే, దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రం ఎన్నికల సందర్భంగా ఈ సారి భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఇవాళ పోలింగ్ సందర్భంగా పలు సంస్థలు ఓటర్లకు ఉచిత రవాణా సదుపాయాలందించేందుకు ముందుకొచ్చాయి. ఆటోలు, బైక్‌లే కాదు స్పైస్ జెట్ విమానయాన సంస్థ కూడా ఉచిత […]
ఎన్నికల వేళ తాయిళాలు ప్రకటించడం రాజకీయ పార్టీలకు కొత్తకాదు. ఓటర్లను బూత్ వరకు తీసుకువెళ్లేందుకు రకరకాల సదుపాయాలు కల్పిస్తుంటాయి. ఎన్నికల సంఘం ఎలాగూ కొన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. అయితే, దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రం ఎన్నికల సందర్భంగా ఈ సారి భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఇవాళ పోలింగ్ సందర్భంగా పలు సంస్థలు ఓటర్లకు ఉచిత రవాణా సదుపాయాలందించేందుకు ముందుకొచ్చాయి. ఆటోలు, బైక్‌లే కాదు స్పైస్ జెట్ విమానయాన సంస్థ కూడా ఉచిత సేవలు అందిస్తున్నాయి. బైక్-టాక్సీ బుకింగ్ యాప్ ‘రాపిడో’ ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఢిల్లీ ఓటర్లకు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ వరకూ ఫ్రీ రైడింగ్ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ‘అభీ బస్ డాట్ కామ్’ కూడా ‘ఐ ఓట్ ఐ విన్’ అనే నినాదంతో ఉచిత బస్సు సేవలందిస్తుండగా, ఎయిర్ లైన్స్ కంపెనీ స్పైస్ జెట్ ఢిల్లీ వచ్చేవారు, తిరిగి ఇదే రోజు వెళ్లిపోతే రానుపోను టికెట్లపై బేస్ చార్జీని రిటర్న్ ఇవ్వనున్నట్టు తెలిపింది.