TTD Good news: శ్రీవారి కానుకలు.. ఎలా పొందాలంటే..!
దిశ, వెబ్‌డెస్క్: పెళ్లికి ముందు మొదటి శుభలేఖను దేవుడికి ఇవ్వడం హిందువులు సంప్రదాయంగా భావిస్తారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా కార్యం జరిగేందుకు పూజలు చేస్తారు. ఆ తర్వాతే బంధువులకు, స్నేహితులకు ఇస్తుంటారు. కొందరు అయితే నేరుగా తిరుమల శ్రీవారికి శుభలేఖ సమర్పించాలని అనుకుంటారు. తిరుపతికి దగ్గరలో ఉన్నవారికి ఎలాంటి సమస్యలు లేవు. కానీ కరోనా కారణంగా సుదూరంగా ఉన్నవారికే సమస్య వచ్చిపడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అవకాశం లేకుండా పోయింది. అలాంటి వారి కోసం టీటీడీ అధికారులు […]
దిశ, వెబ్‌డెస్క్: పెళ్లికి ముందు మొదటి శుభలేఖను దేవుడికి ఇవ్వడం హిందువులు సంప్రదాయంగా భావిస్తారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా కార్యం జరిగేందుకు పూజలు చేస్తారు. ఆ తర్వాతే బంధువులకు, స్నేహితులకు ఇస్తుంటారు. కొందరు అయితే నేరుగా తిరుమల శ్రీవారికి శుభలేఖ సమర్పించాలని అనుకుంటారు. తిరుపతికి దగ్గరలో ఉన్నవారికి ఎలాంటి సమస్యలు లేవు. కానీ కరోనా కారణంగా సుదూరంగా ఉన్నవారికే సమస్య వచ్చిపడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అవకాశం లేకుండా పోయింది. అలాంటి వారి కోసం టీటీడీ అధికారులు ఓ శుభవార్తను చెప్పారు.
వెంకటేశ్వర స్వామికి వెడ్డింగ్ కార్డ్ పోస్ట్ ద్వారా పంపే అవకాశం ఇచ్చారు. కార్డు పంపిన వారికి శ్రీవారి నుంచి విశిష్టమైన పెళ్లి కానుక కూడా అందిస్తామని అధికారులు తెలిపారు. దీంట్లో వధూవరుల చేతి కంకణాలు, అక్షింతలు, కుంకుమ, ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు. అంతే కాదు దీంట్లో వివాహ విశిష్టతను తెలిపే పుస్తకం కూడా వధూవరులకు అందేలా చేస్తారు. ఈ అవకాశాన్ని భక్తులు ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
కార్డు పంపాలని అనుకునే వారు చేయాల్సిందల్లా ఇదొక్కటే.. పెళ్లి నిశ్చయం కాగానే మొదటి శుభలేఖను నెల ముందుగానే తిరుమలకు పంపాల్సి ఉంటుంది. అది అందిన వెంటనే శ్రీవారికి చేర్చి విశిష్టమైన కానుక పంపిస్తారు. పెళ్లి కార్డు పంపాలని అనుకునే వారు శ్రీ లార్డ్ వేంకటేశ్వర స్వామి, ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి చిరునామాకు మొదటి పత్రిక కొరియర్ చేయొచ్చు. కరోనా వేళలో ఇదో మంచి అవకాశమని భక్తులు అభిప్రాయపడుతున్నారు.