కొత్త కార్పొరేటర్లపై కోటి ఆశలు

దిశ, శేరిలింగంపల్లి: ఓటేసి గెలిపించుకున్న కార్పొరేటర్లపై గ్రేటర్ ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. కొత్తవారైనా తమ బాగోగులు పట్టించుకుంటారని.., కాలనీల అభివృద్ధి కోసం శ్రమిస్తారని ఆశిస్తున్నారు. ఒక్కో డివిజన్ లో పదుల సంఖ్యలో సమస్యలు పేరుకుపోయాయి. అసంపూర్తిగా వదిలేసిన పనులున్నాయి. వీటికి తోడు మొన్నటికి మొన్న నాయకులు ఇచ్చిన హా మీలు, చేసిన వాగ్దానాలు నెరవేరుస్తారని ఈ కొత్త కార్పొరేటర్లపై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పది డివిజన్ల పరిధిలోనూ అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని […]

Update: 2021-02-10 13:58 GMT

దిశ, శేరిలింగంపల్లి: ఓటేసి గెలిపించుకున్న కార్పొరేటర్లపై గ్రేటర్ ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. కొత్తవారైనా తమ బాగోగులు పట్టించుకుంటారని.., కాలనీల అభివృద్ధి కోసం శ్రమిస్తారని ఆశిస్తున్నారు. ఒక్కో డివిజన్ లో పదుల సంఖ్యలో సమస్యలు పేరుకుపోయాయి. అసంపూర్తిగా వదిలేసిన పనులున్నాయి. వీటికి తోడు మొన్నటికి మొన్న నాయకులు ఇచ్చిన హా మీలు, చేసిన వాగ్దానాలు నెరవేరుస్తారని ఈ కొత్త కార్పొరేటర్లపై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పది డివిజన్ల పరిధిలోనూ అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని తాము ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు తీరుస్తారని స్థానికులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. నియోజకవర్గంలో అన్ని రకాల ప్రజలు మిళితమై ఉంటారు. ఓపక్క ఐటీతో పా టు మరోపక్క మురికివాడల్లో నివసించే ప్రజలు, చిన్న చిన్న కాలనీలు ఇక్కడా చాలానే కనిపిస్తాయి. ఒక్కో వర్గానిది ఒక్కో సమస్య. కానీ వాటిని తీర్చే బాధ్యతను మా త్రం కొత్త కార్పొరేటర్ల మీదే వేశారు ఆయా డివిజన్ల ప్రజలు. మంచినీరు, గుంతలు లేని రోడ్లు, చెత్తకుప్పలు లేని వీధులు, డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్లు కావాలంటూ పేద, మధ్యతరగతి ప్రజలు ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నాయకులను అడిగిన సందర్భా లు అనేకం ఉన్నాయి. వాటిని తీర్చేందుకు శా యశక్తుల ప్రయత్నిస్తామని కొత్త కార్పొరేటర్లు చెబుతున్నా.. ఆచరణలో ఎంత వరకు సాధ్యమన్నదే ప్రశ్న. ఆయా డివిజన్ల పరిధిలో ఉన్న కాలనీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. అందులో కొ త్త కార్పొరేటర్లు ఏమేరకు విజయం సాధిస్తారో చూడాలి.

గుంతల రోడ్లు, పేరుకుపోయిన డ్రైనేజీలు చాలా డివిజన్లలో గుంతలు పడిన రోడ్లు, దారుల్లో పారుతున్న మురుగు నీరుతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోం ది. గతంలో కురిసిన వర్షాలకు కొన్ని కాలనీలు చెరువులను తలపించాయి. ఇళ్లలోకి మురుగునీరు చేరి ప్ర జలు నానా అవస్థలుపడ్డారు. ముంపు ప్రాంతాలు ఎ క్కువగా ఉండడంతో పాటు చెరువులు, నాలాలు క బ్జాలకు గురై వర్షపు నీరు, మురుగునీరు నాలాల గుం డా ప్రవహించకుండా నిలిచిపోతుంది. చిన్నపాటి వర్షాలకు సైతం కాలనీల్లో నీరు నిలుస్తోంది. కొత్త కార్పొరేటర్లు అయినా దీనిపై దృష్టిపెట్టి అక్రమకట్టడాలను కూల్చాలని, తమ కష్టాలను తీర్చాలని కోరుతున్నారు. ఇళ్లు లేని తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

కొన్ని డివిజన్లలో కనీస వసతులు లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరుకు ఇరుకు రోడ్లు, అవీ మట్టికొట్టుకుపోయి గుంతలు పడి ఉన్నాయి. మామూలుగానే అడుగుతీసి అడుగు వేయలేకుండా మారిపోయాయి. వాటికి సాధ్యమైనంత త్వ రగా మరమ్మతు చేయించాలి స్థానికులు వేడుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యం..మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, హఫీజ్ పేట్, గచ్చిబౌలి, భాగ్యనగర్ కాలనీ, కేపీహెచ్ బీ, మియాపూర్ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆఫీస్ టైమ్ అని కాకుండా ఎప్పుడు చూసినా ఈప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కనిపిస్తుంది. దీనిపై కార్పొరేటర్లు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సమస్యపై సంబంధిత అధికారులతో చర్చించి ప్రత్యామ్నాయం చూడాలని కోరుతున్నారు.

అదీగాక చాలాచోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీ లు లేక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఒకప్పుడు వందలాది ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి కనుమరుగవుతున్నాయి. ఎక్కడ చూసినా నేతల కబంధ హస్తా ల్లోనే ప్రభుత్వ భూములు ఉన్నాయని సామాన్యులు చర్చించుకుంటున్నారు. అడపాదడపా మినహా పెద్దగా పార్కులు లేకుండా పోతున్నాయి. ఉన్న చెరువులను కూడా ఎవరూ పట్టించుకోక పోవడం వల్ల వాటి విస్తీ ర్ణం తగ్గుతుంది. ఆక్రమణలకు గురవుతున్నాయి. వీటిని పరిరక్షించడంతో పాటు వాటి అభివృద్ధికి సైతం కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా అనేక సమస్యలు కొత్త కార్పొరేటర్ల ముందున్నాయి. మరి వీటిని తీర్చడంలో కార్పొరేటర్లు ఏమేరకు సక్సెస్ అవుతారు.., ప్రజల ఆకాంక్షలను తీరుస్తారా అన్నది వేచి చూడాలి మరి.

Tags:    

Similar News