ఆ వార్తలో నిజం లేదు : జీహెచ్ఎంసీ
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే పలుచోట్ల గుర్తులు తారుమారు అయ్యి, ఎన్నికలు వాయిదా పడగా, జియాగూడలో ఓట్లు గల్లంతు అయ్యాయని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ విభాగం ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. జియాగూడ బూత్-38లో మొత్తం 914 ఓట్లు ఉండగా వీటిలో 268 మినహాయించి మిగిలిన ఓట్లను పోలింగ్ స్టేషన్ 29,30,31 లకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ ఓట్లు స్థానిక విద్యశ్రీ పాఠశాల […]
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే పలుచోట్ల గుర్తులు తారుమారు అయ్యి, ఎన్నికలు వాయిదా పడగా, జియాగూడలో ఓట్లు గల్లంతు అయ్యాయని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ విభాగం ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. జియాగూడ బూత్-38లో మొత్తం 914 ఓట్లు ఉండగా వీటిలో 268 మినహాయించి మిగిలిన ఓట్లను పోలింగ్ స్టేషన్ 29,30,31 లకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ ఓట్లు స్థానిక విద్యశ్రీ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఉన్నాయని, ఓట్లు గల్లంతయ్యాయన్నది నిజం కాదని స్పష్టం చేసింది.