నాలుగు భాషల్లో ప్రమాణ స్వీకారం చేసిన గ్రేటర్ కార్పొరేటర్లు

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతి కొత్తగా గెలిచిన కార్పొరేటర్ అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగులో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఉర్దూలో ఎంఐఎం కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. పలువురు మాత్రం హిందీ, ఇంగ్లీష్‌లో కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో 150 స్థానాలకు 149 మంది నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార ఘట్టం ముగిసింది. ఇక మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను కూడా నిర్వహించనున్నారు. […]

Update: 2021-02-11 00:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతి కొత్తగా గెలిచిన కార్పొరేటర్ అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగులో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఉర్దూలో ఎంఐఎం కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. పలువురు మాత్రం హిందీ, ఇంగ్లీష్‌లో కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో 150 స్థానాలకు 149 మంది నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార ఘట్టం ముగిసింది. ఇక మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను కూడా నిర్వహించనున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు 56, ఎంఐఎం 44, బీజేపీ 48+1 కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీ తరఫున ఎన్నికల్లో గెలిచిన లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేశ్ గౌడ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఎక్స్‌అఫిషీయో మెంబర్‌గా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యక్తిగత కారణాలతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాను అని చెప్పినప్పటికీ.. చివరల్లో కార్యక్రమానికి హాజరుకావడం గమనార్హం.

Tags:    

Similar News