హైదరాబాద్‌లో ఆహ్లాదభరితంగా శ్మశానవాటికలు

దిశ, తెలంగాణ బ్యూరో /బేగంపేట, శేరిలింగంపల్లి: శ్మశాన వాటిక‌ల‌ను పూర్తిస్థాయిలో ఆధునీక‌రించ‌డంతో పాటు అవసరమైన వసతులను కల్పించేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సిటీలో రూ. 4.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బేగంపేట దనియాలగుట్ట శ్మశానవాటిక అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. ఆధునిక‌ వ‌స‌తుల‌తో నిర్మించనున్న ఈ శ్మశానవాటికలో ప్రహ‌రీ, చితిమంట‌ల ఫ్లాట్‌ఫామ్‌ నిర్మాణం, ప్రార్థన గ‌ది, వెయిటింగ్ ఏరియా, పార్కింగ్ ఎల‌క్ట్రిఫికేష‌న్‌, హ‌రిత‌హారం, ల్యాండ్ స్కేపింగ్‌ల‌ను జీహెచ్ఎంసీ […]

Update: 2021-01-19 13:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో /బేగంపేట, శేరిలింగంపల్లి: శ్మశాన వాటిక‌ల‌ను పూర్తిస్థాయిలో ఆధునీక‌రించ‌డంతో పాటు అవసరమైన వసతులను కల్పించేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సిటీలో రూ. 4.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బేగంపేట దనియాలగుట్ట శ్మశానవాటిక అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. ఆధునిక‌ వ‌స‌తుల‌తో నిర్మించనున్న ఈ శ్మశానవాటికలో ప్రహ‌రీ, చితిమంట‌ల ఫ్లాట్‌ఫామ్‌ నిర్మాణం, ప్రార్థన గ‌ది, వెయిటింగ్ ఏరియా, పార్కింగ్ ఎల‌క్ట్రిఫికేష‌న్‌, హ‌రిత‌హారం, ల్యాండ్ స్కేపింగ్‌ల‌ను జీహెచ్ఎంసీ నిర్మించనున్నారు. వీటితో పాటు ఫతేనగ ర్ నాలా విస్తరణ పనులు, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని ధనలక్ష్మి కాలనీలో నాలా విస్తరణ, బాలాజీనగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జేఎన్టీయూ మంజీరా మాల్ వద్ద నిర్మించిన పార్కును ప్రారంభించడంతో పాటు కేపీహెచ్ బీ 4వ ఫేజ్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు, 6వ ఫేజ్‌లో నాలా పనులు, అల్లాపూర్‌లో నాలా విస్తరణ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

శ్మశాన వాటికల అభివృద్ధిపై దృష్టి

గ్రేటర్ లో శ్మశాన వాటికల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. శ్మశాన వాటిక‌ల‌ను పూర్తిస్థాయిలో ఆధునీక‌రించ‌డంతో పాటు బాధ‌తో వ‌చ్చేవారికి స్వాంత‌న ల‌భించే స్థలాలుగా ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ లోని గ్రేవ్‌ యార్డ్‌ లన్నింటినీ జీహెచ్ఎంసీ ఆధునీక‌రిస్తోంది. జీహెచ్ఎంసీ నిధుల‌తో కొన్ని శ్మశాన‌వాటిక‌ల‌ను అభివృద్ధి చేయ‌డంతో పాటు, మరికొన్నింటిని కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్ బులిటీ కింద ప‌లు ప్రైవేట్ సంస్థల‌తో అభివృద్ధి చేయించింది. దీనిలో భాగంగా రాయ‌దుర్గ్‌ లో స‌ర్వహంగుల‌తో రూపొందించిన మహా ప్రస్థానం శ్మశానవాటిక దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఇదే తరహాలో ఇత‌ర శ్మశాన‌వాటిక‌లను కూడా బల్దియా అభివృద్ధి చేస్తోంది. వీటిలో పలు శ్మశాన వాటికల పనులు పూర్తికాగా మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. ఇటీవల రూ. 2.96 కోట్ల వ్యయంతో బల్కంపేటలో నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

Tags:    

Similar News