శేరిలింగంప‌ల్లిలో ప‌ర్య‌టించిన మేయ‌ర్

దిశ, న్యూస్‌బ్యూరో : హైదరాబాద్ న‌గ‌ర‌ మేయర్ బొంతు రామ్మోహన్ శేరిలింగంపల్లి పరిధిలోని కంటైన్మెంట్ జోన్లలో శనివారం పర్యటించారు. అపార్ట్మెంట్ లలో నివసిస్తున్న ప్రజలతో మాట్లాడారు. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) నుంచి కాపాడుకునేందుకు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలనీ, సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించాలని సూచించారు. నిత్యావసరాలు అందుబాటులో ఉన్నాయనీ, అందరూ ఆరోగ్యంగా ఉన్నామని స్థానికులు మేయర్‌కు వివరించారు. హఫీజ్ పేట్ డివిజన్‌లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లలో పరిస్థితులను మేయర్ పరిశీలించారు. అపార్ట్‌మెంట్ వద్ద […]

Update: 2020-04-18 07:41 GMT

దిశ, న్యూస్‌బ్యూరో : హైదరాబాద్ న‌గ‌ర‌ మేయర్ బొంతు రామ్మోహన్ శేరిలింగంపల్లి పరిధిలోని కంటైన్మెంట్ జోన్లలో శనివారం పర్యటించారు. అపార్ట్మెంట్ లలో నివసిస్తున్న ప్రజలతో మాట్లాడారు. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) నుంచి కాపాడుకునేందుకు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలనీ, సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించాలని సూచించారు. నిత్యావసరాలు అందుబాటులో ఉన్నాయనీ, అందరూ ఆరోగ్యంగా ఉన్నామని స్థానికులు మేయర్‌కు వివరించారు.

హఫీజ్ పేట్ డివిజన్‌లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లలో పరిస్థితులను మేయర్ పరిశీలించారు. అపార్ట్‌మెంట్ వద్ద కూరగాయలు అమ్ముతున్న వారి బాగోగులు తెలుసుకుని, వారికి శానిటైజర్లు, మాస్క్‌లను అందజేశారు. చందానగర్ సర్కిల్‌లోని ఆదిత్యా సన్ షైన్ గెటేడ్ కమ్యూనిటీ, మీనాక్షి అపార్ట్‌మెంట్ సభ్యులతో మేయర్ సమావేశాన్ని నిర్వహించారు. సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవికిరణ్, డీసీ సుదాంష్‌, కార్పొరేటర్ జగదీష్ గౌడ్ సమావేశంలో పాల్గొన్నారు.

Tags: GHMC Mayor, Bonthu Rammohan, covid 19 effect, lock down, Sherilingamaplli

Tags:    

Similar News