జెనీవా 10కే రేసులో కల్కిదన్ రికార్డ్

దిశ, స్పోర్ట్స్: బెహ్రెయిన్‌కు చెందిన కల్కిదన్ గెజహేన్ జెయింట్స్ జెనీవా 10కే మారథాన్ గెలుచుకున్నది. ఆదివారం జెనీవాలో జరిగిన 10 కిలోమీటర్ల రేస్ ను 29 నిమిషాల 38 సెకెండ్లలో పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. కల్కిదన్ టోక్యో ఒలింపిక్స్ 10వేల మీటర్ల పరుగులో రజత పతకం సాధించిన తర్వాత ఈ రేసులో మొదటి స్థానంలో నిలిచింది. గతంలో కెన్యాకు చెందిన జాయ్‌సిలీన్ 29 నిమిషాల 43 సెకెన్లలోనే పూర్తి చేయగా.. తాజాగా కల్కిదన్ 5 […]

Update: 2021-10-03 10:24 GMT

దిశ, స్పోర్ట్స్: బెహ్రెయిన్‌కు చెందిన కల్కిదన్ గెజహేన్ జెయింట్స్ జెనీవా 10కే మారథాన్ గెలుచుకున్నది. ఆదివారం జెనీవాలో జరిగిన 10 కిలోమీటర్ల రేస్ ను 29 నిమిషాల 38 సెకెండ్లలో పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. కల్కిదన్ టోక్యో ఒలింపిక్స్ 10వేల మీటర్ల పరుగులో రజత పతకం సాధించిన తర్వాత ఈ రేసులో మొదటి స్థానంలో నిలిచింది. గతంలో కెన్యాకు చెందిన జాయ్‌సిలీన్ 29 నిమిషాల 43 సెకెన్లలోనే పూర్తి చేయగా.. తాజాగా కల్కిదన్ 5 సెకెన్ల ముందే రేస్ పూర్తి చేసి రికార్డును సవరించింది. అగ్నెస్ టైరోప్ 30 నిమిషాల 1 సెకెన్‌లో రేస్ పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. కెన్యాకు చెందిన సిల్లిపైన్ మూడో స్థానంలో నిలిచింది. కాగా, ఈ రేస్ పురుషులతో కలిపి జరిగింది. కిబివోట్ కాండీ 26 నిమిషాల 51 సెకెన్లలో రేస్ పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచాడు.

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma