కరోనా అధ్యయనం కోసం కాన్సర్ట్!

కరోనా.. కరోనా.. కరోనా.. గత నాలుగు నెలల నుంచి ఇదే గోల. ఓవైపు చాప కింద నీరులా వ్యాపిస్తున్నా.. మరోవైపు జనాలు పట్టించుకోకుండా తిరుగుతున్నారు. ప్రపంచాన్ని ఇంతలా వణికిస్తున్న ఈ వైరస్‌ను వీలైనన్ని కోణాల్లో అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. కొందరు శాస్త్రవేత్తలు మందు కోసం పరిశోధనలు చేస్తుంటే, మరికొందరు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎలాగూ జనాలు వైరస్‌ను పట్టించుకోకుండా తిరుగుతున్నారు కదా.. అది వ్యాపించే రేటును పరిశోధించడానికి ఇంకొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు […]

Update: 2020-08-23 04:46 GMT

కరోనా.. కరోనా.. కరోనా.. గత నాలుగు నెలల నుంచి ఇదే గోల. ఓవైపు చాప కింద నీరులా వ్యాపిస్తున్నా.. మరోవైపు జనాలు పట్టించుకోకుండా తిరుగుతున్నారు. ప్రపంచాన్ని ఇంతలా వణికిస్తున్న ఈ వైరస్‌ను వీలైనన్ని కోణాల్లో అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. కొందరు శాస్త్రవేత్తలు మందు కోసం పరిశోధనలు చేస్తుంటే, మరికొందరు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎలాగూ జనాలు వైరస్‌ను పట్టించుకోకుండా తిరుగుతున్నారు కదా.. అది వ్యాపించే రేటును పరిశోధించడానికి ఇంకొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. అందులో భాగంగా జర్మన్ పరిశోధకులు ఒక కొత్త రిస్క్ తీసుకున్నారు.

కాన్సర్ట్‌లు, ప్రోగ్రామ్‌లు, ఇండోర్ కార్యక్రమాల్లో కరోనా వైరస్ ఏ విధంగా వ్యాపిస్తుందో తెలుసుకోవడానికి ఒక కాన్సర్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంగీత కాన్సర్ట్‌కు 1500 మంది హాజరయ్యారు. ఈ 1500 మందికి ముందే టెస్ట్ చేసి నెగెటివ్ అని నిర్ధారించినవారే. వీరిని మూడు బ్యాచ్‌లుగా విడగొట్టి మూడు విధాలుగా ఈ కాన్సర్ట్‌ను నిర్వహించినట్లు ప్రొఫెసర్ మైకేల్ గెక్లే తెలిపారు. మొదటి విధానంలో సామాజిక దూరం పాటించకుండా గతంలో మాదిరిగా కాన్సర్ట్ నిర్వహించారు. రెండో విధానంలో పాల్గొన్న వాళ్లందరికీ మాస్కులు, శానిటైజర్, విండ్ షీల్డ్ ఇచ్చారు. మూడో విధానంలో తక్కువ మందిని అనుమతించి సామాజిక దూరం పాటించేలా చేశారు. ఈ మూడు విధానాల్లోనూ మనుషులు ఒకరితో ఒకరు తాకడాన్ని, ఎదురుపడటాన్ని ముందే వారికి జోడించిన సెన్సార్ల ద్వారా డేటా రూపంలో సేకరిస్తారు. దాన్ని బట్టి నిజంగా వారిలో ఒకరికి వైరస్ ఉంటే అది వేగంగా వ్యాపించి ఉండేదనే నమూనాలను సృష్టిస్తారు. అయితే ఇక్కడ రిస్క్ ఏంటంటే ఆ కాన్సర్ట్‌కు వచ్చిన 1500 వాలంటీర్‌లలో ఏ ఒక్కరికి బయటికి కనిపించకుండా కరోనా ఉంటే పరిస్థితి ఏంటని కొందరు విమర్శించారు. ఈ కాన్సర్ట్‌ను వ్యతిరేకించారు. కానీ పరిశోధకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కాన్సర్ట్ నిర్వహించారు. త్వరలో ఫలితాలను బయటపెడతామని టిమ్ అన్నారు. జర్మన్ సింగర్ టిమ్ బెండ్‌జ్కో ఈ కాన్సర్ట్‌ను నిర్వహించగా, హాలో యూనివర్సిటీ పరిశోధకులు ఈ ప్రయోగం చేశారు.

Tags:    

Similar News