జార్జియాలో వీడని ఉత్కంఠ
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. అధ్యక్ష రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌తో అధికారపీఠం దోబూచులాడుతోంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. తాజాగా జార్జియా ఓట్ల లెక్కింపు 99 శాతం పూర్తయ్యి, కౌంటింగ్ చివరి దశకు వచ్చింది. అక్కడ కూడా ట్రంప్ మెజార్టీ తగ్గుతోంది. ఇందులో బైడెన్‌కు 24,49,371 రాగా, ట్రంప్‌నకు 24,48,454 వచ్చాయి. ఇంకా ఐదు రాష్ట్రాల ఫలితాలపై ఉత్కంఠ […]
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. అధ్యక్ష రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌తో అధికారపీఠం దోబూచులాడుతోంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. తాజాగా జార్జియా ఓట్ల లెక్కింపు 99 శాతం పూర్తయ్యి, కౌంటింగ్ చివరి దశకు వచ్చింది. అక్కడ కూడా ట్రంప్ మెజార్టీ తగ్గుతోంది. ఇందులో బైడెన్‌కు 24,49,371 రాగా, ట్రంప్‌నకు 24,48,454 వచ్చాయి. ఇంకా ఐదు రాష్ట్రాల ఫలితాలపై ఉత్కంఠ వీడడం లేదు. ఈ ఐదు రాష్ట్రాలను ట్రంప్ కైవసం చేసుకుంటే మరోసారి అధ్యక్షపీఠం ఎక్కే ఛాన్స్ ఉంటుంది. కాగా నెవాడా, జార్జియాలలో ఏది ఓడిపోయినా ఇక ట్రంప్ ఇంటి ముఖం పట్టాల్సిందే. ఇప్పటికే అధికారపీఠం వైపు అడుగులు వేస్తున్న ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ ఆరు ఎలక్టోరల్ ఓట్లున్న ఒక్క నెవాడాలో విజయం సాధిస్తే ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు పూర్తి స్థాయిలో కలుగుతాయి. కాగా ఇప్పటివరకూ బైడెన్‌కు 264, ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.